దేవరపల్లి: గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కాంట్రాక్టర్ రాజేష్ బినామీగా వ్యవహరిస్తున్నట్టు ఇటీవల అధికారపార్టీ నాయకులు బాహాటంగా ఆరోపించారు. రాజేష్ ఎవరో తనకు తెలియదని, అతను తన బంధువు కాదని ఇటీవల ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రకటించారు. ‘అభివృద్ధి ముసుగులో అవినీతి దందా’ శీర్షికన ‘సాక్షి’లో గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనకు రాజేష్‌తో ఎటువంటి అనుంబంధం లేదని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. అయితే ఎమ్మెల్యే ముప్పిడితో రాజేష్‌కు గల అనుబం«ధానికి నిదర్శనంగా ఈ చిత్రం చూడవచ్చు. మరి ఇదే రకమైన అనుబంధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment