సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆపరేషన్ మోబిలైజేషన్ గ్రూప్ పై 11చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని మోబిలైజేషన్ గ్రూప్ విదేశాల నుంచి రూ.300 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ నిధుల్ని ఓం ఫౌండేషన్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ, కేరళ మహారాష్ట్ర,కర్ణాటకలో ఈడీ సోదాలు జరిపారు.ఈ సోదాల్లో బినామీ పేర్లతో నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment