► రూ.4వేలకు రూ.500'
► పేదలే పెద్దలకు బినామీలు
► వేలిపై గుర్తుతో చెక్
‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చోరీకి వల్ల కాక మరొకడు ఏడ్చాడు’ అనేది ప్రజల నోళ్లలో తరచూ నానుతుండే సామెత. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఆ సామెతను తలపిస్తున్నారుు. చెల్లని నోట్లను మార్చుకోలేక పేదలు అల్లాడుతుంటే బినామీలుగా మారిన వారికి కమీషన్లు అంటూ పెద్దలు ప్రలోభపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఈనెల 8వ తేదీన కేం ద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకుల ద్వారా 10వ తేదీ నుంచి పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల ను మార్చుకోవచ్చంటూ చేసిన ప్రకటనతో ప్రజలు ఉరకలెత్తారు. పరిమితమైన నోట్లను కలిగి ఉన్న ప్ర జలు బ్యాంకుల వద్ద బారులు తీరగా భారీ మొత్తం లో నగదును దాచిపెట్టిన ధనికులు బావురుమన్నా రు. రూ.2.5లక్షలకు పైగా బ్యాంకుల్లో జమ చేస్తే లెక్కలు చూపాల్సి ఉంటుంది. అంతేగాక 200 శాతం ఆదాయపు పన్ను కట్టక తప్పదు. బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయపు పన్నుశాఖ తంటా కావడంతో అక్రమార్కులంతా వక్రమార్గం వైపు కదులుతున్నారు. తమకు నమ్మకమై పేదలను, సన్నిహితులను బినామీలుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమచేరుుస్తున్నారు.
చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ధనికులు తాము ఎంచుకున్న పేదలను ఉదయాన్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. వారి చేతిలో రూ. 4,500 పెట్టి మార్చుకుని రమ్మని చెబుతున్నారు. ఈ పని పూర్తి చేసిన వారికి రూ.300 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నారు. సాయంత్రానికి నాలుగుసార్లు వెళితే రూ.2వేలు కమీషన్‌గా గిట్టుతోంది. ఇలా ఎన్నిసార్లరుునా బ్యాంకులకు వెళ్లేందుకు పేదలు సిద్ధం కావడంతో గట్టిపోటీ ఏర్పడింది. కరెన్సీ మార్పిడి చేసే పేదలు, కూలీలకు గిరాకీ ఏర్పడడంతో వారిని సరఫరా చేసేందుకు సహజంగానే బ్రోకర్లు తయారయ్యారు. ’ఎదావదు ఇరుందాల్ సొల్లుంగ...సత్తమిల్లామల్ ముడిచ్చిడలాం’ (ఏదైనా ఉంటే చెప్పండి గుట్టుగా పూర్తిచేసుకువస్తా) అనే కోడ్ భాష చెలామణిలోకి వచ్చింది.
నేటి నుంచి వేలిపై గుర్తు:
నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బినామీలతో గండికొట్టకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఒకే వ్యక్తి పదేపదే బ్యాంకులకు వస్తూ కరెన్సీని మార్చడాన్ని నిరోధించనుంది. ఓటు హక్కును వినియోగించుకునే తరహాలో బ్యాంకులో నగదును జమ చేసిన వ్యక్తి వేలిపై ముద్ర వేసే విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మంగళవారమే కొన్ని బాంకుల్లో వేలిముద్ర విధానం అమలులోకి వచ్చినట్లు సమాచారం. అలాగే ఇతరుల ఖాతాలో డబ్బును జమ చేయాలంటే ఖాతాదారుడు నేరుగా రావడమో లేదా అతని స్వదస్తూరితో ఉత్తరం జమ చేయడమో తప్పనిసరి చేశారు.
తప్పని తిప్పలు:
కరెన్సీ నోట్లు రద్దరుు ఆరు రోజులు దాటుతున్నా బ్యాంకుల వద్ద ప్రజల తిప్పలు తప్పడం లేదు. చాంతాడంత క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు చేరుకునేసరికి క్యాష్ అరుుపోందని కొన్ని బ్యాంకుల్లో వెనక్కుపంపుతున్నారు. ఇక ఏటీఎంలో పెట్టిన లక్షలాది రూపాయలు నిమిషాల వ్యవధిలో ఖాళీ అరుుపోతున్నారుు. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.2 వేలనోట్లు మాత్రమే లభ్యమవుతుండగా, రూ.500ల కొత్త నోట్లు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నారుు. చిల్లర కోరేవారికి కొన్ని చోట్ల రూ.5, రూ.10ల నాణేలను అందజేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను చెల్లింపునకు పాత నోట్లు స్వీకరించడంతో సోమవారం ఒకే రోజు రూ.8 కోట్లు వసూలైంది.
కరెన్సీకి కమీషన్
Published Wed, Nov 16 2016 3:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
Advertisement
Advertisement