రాష్ట్ర నూతన రాజధానిలోఉండాలనే ఉద్దేశంతో మగాడిలా భూములను కొనుక్కున్నానని ఎమ్మెల్సీ, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు.
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలోఉండాలనే ఉద్దేశంతో మగాడిలా భూములను కొనుక్కున్నానని ఎమ్మెల్సీ, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. తాను తన కొడుకు పేరిట ఆ భూములను కొన్నానని, బినామీల పేరుతో కొనలేదని అన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దమ్ముంటే, ఆయనలో రాయలసీమ రక్తం ఉంటే ఆయన తన మూడుతరాల ఆస్తులపై ప్రకాశం బ్యారేజీ మీద చర్చకు రావాలని సవాల్ చేశారు. తన పేరిట ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో, అసెంబ్లీకి సమర్పించే ఆస్తుల వివరాల్లో పేర్కొనలేని దౌర్భాగ్య స్థితి జగన్‌దని అన్నారు. తనతో పాటు మంత్రులు పుల్లారావు, నారాయణ తదితరులపై సాక్షిలో వచ్చిన వార్తలపై శుక్రవారం నుంచి సమగ్ర వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.