జన్ధన్ ఎంత?
నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాక...
పేదలకు చెందిన జన్‌ధన్ బ్యాంకు ఖాతాలకు బినామీలను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేటట్లుగా తొలి వారంలోనే (నవంబరు 8-15) ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 20,206 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చారుు. దీంతో ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టింది. జన్‌ధన్ ఖాతాలను దుర్వినియోగపర్చే వారికి శిక్ష తప్పదని ఓ సభలో ప్రధాని మోదీ స్వయంగా హెచ్చరించారు. ఈ ఖాతాల నుంచి నెలకు రూ. 10 వేలు మించి ఉపసంహరణకు అనుమతించబోమని పరిమితి కూడా విధించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న జన్‌ధన్ ఖాతాలు, వాటిల్లోని డిపాజిట్ల వివరాలు చూద్దాం.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్