బినామీ లెక్కలేవీ బాబూ: వినోద్ ప్రశ్న | what about your benami properties, Vinod asks chandra babu naidu | Sakshi
Sakshi News home page

బినామీ లెక్కలేవీ బాబూ: వినోద్ ప్రశ్న

Published Tue, Sep 17 2013 3:20 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

what about your benami properties, Vinod asks chandra babu naidu

సాక్షి, హైదరాబాద్: బినామీల పేర్ల మీదున్న ఆస్తుల వివరాలు చెప్పకుండా అవే పాత లెక్కలను చంద్రబాబునాయుడు చెప్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీచేసిన వారందరి ఆస్తుల వివరాలు వెబ్‌సైట్లలో ఉన్నాయన్నారు. కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు సహా ఏవైనా తప్పు చెప్తే అనర్హతకు గురౌతారని కూడా ఎన్నికల సంఘం చెప్తోందని వివరించారు. ఆస్తులను చంద్రబాబు ఒక్కరే ప్రకటించినట్టు, మిగిలినవారూ ప్రకటించాలని సవాల్ విసరడం అందరికీ నవ్వు తెప్పిస్తోందని వినోద్‌కుమార్ అన్నారు. చంద్రబాబు చెప్పిం దాంట్లో కొత్తేమీ లేదన్నారు. బినామీ ఆస్తుల వివరాలను కూడా చంద్రబాబుకు దమ్ముంటే వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement