benami properties
-
రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీ అధికారులు
సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా, ఆదాయ పన్ను అధికారులు విచారించారు. బినామీ ఆస్తుల కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు సోమవారం విచారించారు. యూకేలోని ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి ద్వారా కొనుగోలు చేసిన లండన్ ఆస్తులతో ముడిపడి ఉన్న ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో బ్రయాన్స్టన్ స్క్వేర్ భవనం సుమారు 77 17.77 కోట్ల విలువైన ఆస్తితోపాటు, మరొకవిలువైన ఆస్తిని కొనుగోలు చేసిన కేసులో కూడా వాద్రాను ఈడీ విచారిస్తోంది. అలాగే 4 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.37.42 కోట్లు) 5 మిలియన్ పౌండ్ల (రూ. 46.77 కోట్ల కంటే ఎక్కువ) విలువైన మరో రెండు ఆస్తులను కూడా ఈడీ అక్రమ ఆస్తులుగా గుర్తించింది. వీటితోపాటు ఆరు ఫ్లాట్లు కూడా వాద్రాకు చెందినవని అనుమానిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. 2005 -2010 మధ్య వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మొత్తంగా లండన్‌లో సుమారు 12 బిలియన్ల పౌండ్లమ ఆస్తులను కలిగి ఉన్న కేసులో విచారణ జరుగుతోంది. అలాగే గుర్గావ్లో భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2018 సెప్టెంబర్‌లో ఆయనపై, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై కూడా పోలీసు కేసు నమోదైంది. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేసినట్లు వాద్రా ఆరోపించారు. -
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
-
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
న్యూఢిల్లీ/ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు పీఎన్బీని రూ. 11,400 కోట్లకు మోసగించిన కేసులో దర్యాప్తు సంస్థలు దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని గుర్తించాయి. భారత్‌తో పాటు విదేశాల్లోని ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నెరపి.. స్థలాలు, బంగారం, విలువైన రాళ్ల రూపంలో బినామీ ఆస్తుల్ని కూడగట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా మోదీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల నగల దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దాదాపు 24 స్థిరాస్తుల్ని గుర్తించి మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఈడీ రూ. 5,674 కోట్ల మేర వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసిన 29 ఆస్తుల విలువను కూడా అంచనా వేస్తున్నాం. త్వరలో మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తాం’ అని ఈడీ తెలిపింది. అందరికీ పర్సంటేజీలు.. మెహుల్ చోక్సీ ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి గ్రూప్ కంపెనీల అనుబంధ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీని ఆదివారం తనిఖీ చేసిన సీబీఐ.. కస్టడీలో ఉన్న పీఎన్బీ ఉద్యోగులు గోకుల్ నాథ్ శెట్టి (రిటైర్డ్), మనోజ్ ఖారత్, నీరవ్ హామీదారు హేమంత్ భట్‌ను ప్రశ్నించింది. విచారణలో శెట్టి, ఖారత్లు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించినట్లు సమాచారం. నీరవ్ , చోక్సీలకు ‘లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్ల జారీ కోసం మంజూరు చేసిన మొత్తానికి అనుగుణంగా పర్సంటేజీలు వసూలు చేసేవారని, కుంభకోణంతో ప్రమేయమున్న అందరు అధికారులకు ఆ మొత్తాన్ని పంచేవారని తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణానికి కేంద్ర బిందువైన ముంబైలోని బ్రాడీ రోడ్డు బ్రాం చ్‌ను సీబీఐ దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సోమవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తుల్ని విచారించిన దర్యాప్తు సంస్థ.. వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించింది. వారిలో పలువురు బ్యాంకు అధికారులుండగా.. ఒకట్రెండు రోజుల్లో వారిని మరోసారి విచారించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు సర్వర్ల నుంచి స్వా«ధీనం చేసుకున్న రికార్డుల్ని అధ్యయనం చేస్తున్నామని, క్విడ్ ప్రో కో కోణంలో కూడా దర్యాప్తు ఉంటుందని.. ప్రస్తుతం దృష్టంతా కేసును పూర్తిగా వెలికితీసి.. నిధులు ఎక్కడికి మళ్లాయో తెలుసుకోవడంపైనే ఉందని సీబీఐ వెల్లడించింది. శ్వేతపత్రం విడుదల చేయాలి: కాంగ్రెస్ దేశంలోని ఆర్థిక మోసగాళ్లతో బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఐదేళ్లలో రూ. 61 వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణాలు చోటుచేసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించిందని, ఆ ఐదేళ్లలో నాలుగేళ్లు ఎన్డీఏనే అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థిక మోసగాళ్లకు, బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలు.. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకొని మోసగించిన సంస్థలు, ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థల యజమానుల వివరాల్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బయటపెట్టేలా కేంద్రం ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న ఎన్పీఏలు(నిరర్ధక ఆస్తులు), బ్యాంకుల్ని మోసగించిన సంస్థల వివరాల్ని వెబ్సైట్లలో ప్రజలకు తెలిసేలా అన్ని బ్యాంకులు ఉంచాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకు మోసాలకు బీజం పడిందంటున్న బీజేపీ గత నాలుగేళ్ల కాలంలో వాటిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల మొత్తం విలువ రూ. 8,36,782 కోట్లు కాగా.. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని, ఎన్‌పీఏల్లో కార్పొరేట్ కంపెనీల వాటా 77 శాతమని తివారీ తెలిపారు. రెండు నిమిషాలు కూడా మాట్లాడలేరా?: రాహుల్ పీఎన్బీ కుంభకోణంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నోరు విప్పాలని, తప్పు చేసిన వారిలా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ‘పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవ్వాలో విద్యార్థులకు ప్రధాని మోదీ రెండు గంటలు పాఠాలు చెప్పారు. అయితే రూ.22 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరు. జైట్లీ దాక్కుంటున్నారు’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. -
ప్రజల్ని నగ్నంగా నిలబెట్టకండి -శివసేన
ముంబై: శివసేన అధినేత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై శివసేన పదునైన వ్యాఖ్యలతో దాడికి దిగింది. బినామీ ఆస్తులకు చెక్ పెట్టే పేరుతో పేదలను నగ్నంగా నిలబెట్టొందంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సూచించారు. దేశంలో అరాచకశక్తులకు వ్యతిరేకంగా మోదీ పోరాటాన్ని అభినందిస్తున్నామంటూనే, శివసేన అధికార పత్రిక సామ్నా, దో్ పహర్ కా సామ్నాలో బుధవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బినామీ ఆస్తులను వెలికి తీసే నెపంతో పేదలకు మిగిలిన చడ్డీ బనియన్ ను కూడా తొలగించొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించింది. ప్రధాని నిర్ణయం హర్షించ దగినదే అయినా పెద్దనోట్ల రద్దు తర్వాతలా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాల పాలు కావడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్ ఆర్ ఐ,ఇతర మాఫియాలు తమ నల్లధనాన్ని వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు కానీ దురదృష్టవశాత్తు సాధారణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు కష్టాలు మరింత పెరిగాయే తప్ప, నల్లధనం ఒక్కపైసా కూడా పట్టుబడలేదు.. ఒక్క పారిశ్రామికవేత్తనూ శిక్షించలేదంటూ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని వాగ్దానం చేసిన మోదీ ఒక్క పైసా తేలేదు. కానీ ప్రజలు పెద్దనోట్ల రద్దు తీవ్రతను భరించారు..ఇప్పటికీ బాధలు కొనసాగుతున్నాయని థాకరే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ తరువాత పాకిస్థాన్ టెర్రర్ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయనీ, దీంతో ఇప్పటివరకు 50 పైగా భారతీయ సైనికుల మరణానికి దారితీసిందన్నారు. అలాగే కశ్మీరీ పండిట్లకు చట్టబద్దంగా రావాల్సిన ఆస్తులు వారికి దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం సర్జికల్ దాడులు ప్రభుత్వం చేస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాశ్మీరీ పండితుల చట్టబద్ధ-యాజమాన్య ఆస్తుల హక్కులు తారుమారు కావని తాము ఆశిస్తున్నామన్నారు. -
నోట్ల రద్దు భేష్.. బినామీల పనిపట్టండి: సీఎం
దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తి మద్దతు పలుకుతున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడంతో పాటు.. బిహార్‌లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన నితీష్.. ఇప్పుడు మోదీ విధానాలకు మద్దతు పలకడం ఆశ్చర్యకరమే. అయినా.. అంశాల వారీగానే తన అభిప్రాయాలు ఉంటాయి తప్ప బద్ధ శత్రుత్వం ఉండబోదన్న విషయాన్ని నితీష్ కుమార్ నిరూపించుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నకిలీ నోట్లన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయని ఆయన అన్నారు. బిహార్‌లోని మధుబని ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుతో పాటు.. ఎవరెవరి వద్ద బినామీ ఆస్తులు ఉన్నాయో కూడా దృష్టిపెట్టాలని నితీష్ సూచించారు. బినామీ ఆస్తుల మీద కూడా కేంద్రప్రభుత్వం వీలైనంత త్వరగా దాడులు చేయాలని ఆయన కోరారు. -
'బినామీ' ఆస్తులు అంటే..
''బినామీ ఆస్తుల గుట్టుమట్లు విప్పుతాం. వీటిపై చర్యలుంటాయి. నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపే దిశగా ఇదో గొప్ప ముందడుగు అవుతుంది. ఇతరులు, బినామీల పేరిట కొన్న ఆస్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నాం. అది దేశ ప్రజల ఆస్తి'' -పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదివారం గోవాలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి. ఇదేదో యాథాలాపంగా చేసిన ప్రకటన కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఈనెల 8న రాత్రి ఆకస్మికంగా ప్రకటించడానికి చాలా ముందునుంచే నల్లధన కట్టడికి కేంద్రప్రభుత్వం పలురకాలుగా సన్నద్ధమవుతోంది. స్థిరాస్తి రంగం పెట్టుబడుల్లో నల్లధనం ఎక్కువే. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా తెచ్చిన చట్టమే 'బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం-2016'. ఇది జులై 27న లోక్‌సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఆమోదం పొంది తర్వాత చట్టరూపం దాల్చింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసింది. బినామీల పేరిట వ్యవహారాలు చక్కబెట్టేవారికి కఠినమైన శిక్షలు, జరిమానాలు పొందుపర్చారు. సవరించిన ఈ చట్టం ఆధారంగానే మోదీ సర్కారు బినామీ లావాదేవీలపై తదుపరి చర్యలకు దిగనున్న నేపథ్యంలో.. చట్టంలో ఏముంది? బినామీ లావాదేవీలను ఎలా గుర్తిస్తారు? ఎలా శిక్షలు, జరిమానాలుంటాయి? మినహాయింపులేమిటి? అనే వాటిని చూద్దాం. 'బినామీ' అంటే.. పన్ను కట్టని అక్రమ సంపాదన, అవినీతి డబ్బుతో ఇతరుల పేరిట ఆస్తులను కొనడం. ఉదాహరణకు తన దగ్గర పనిచేసే ఉద్యోగి, డ్రైవర్ లేదా మిత్రుల పేరిట ఆస్తులు కొనుగోలు చేయడం. ఇక్కడ ఆస్తి పత్రాల్లో యజమానిగా ఒకరి పేరు ఉంటుంది కానీ వాస్తవంగా సదరు ఆస్తిని కొనడానికి ఇంకెవరో డబ్బు చెల్తిస్తారు. పేరుకే పత్రాల్లో యజమాని కానీ సదరు ఆస్తిపై హక్కులను జీపీఏ రూపంలో మరొకరు (వాస్తవంగా డబ్బు చెల్లించిన వ్యక్తి లేదా అసలు యజమాని) అనుభవిస్తుంటారు. జీపీఏ చేయించుకొని తమకు ఇష్టం ఉన్నపుడు అమ్ముకుంటారు. పత్రాల్లో పేరున్నతను మరెవరికో బినామీగా వ్యవహరిస్తాడన్న మాట. 1. ఆస్తి ఎవరి పేరిట ఉందో ఆ వ్యక్తి దానికి సంబంధించి తనకేమీ తెలియదని, అది తనది కాదని, తాను కొనలేదని ఖండిస్తే... సదరు ఆస్తిని బినామీ ఆస్తిగా పరిగణిస్తారు. 2. ఆస్తి అమ్మిన వ్యక్తి ఆచూకీ లభించనపుడు సైతం దానిని బినామీ ఆస్తిగా ప్రకటిస్తారు. మినహాయింపులు... 1. జీవిత భాగస్వామి లేదా పిల్లల (కూతురు, కుమారుడు) పేరిట చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో ఆస్తులు కొంటే బినామీ కిందకు రాదు. 2. చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బంధువులతో కలిపి ఉమ్మడి ఆస్తి కొంటే కూడా బినామీ కాదు. 3. ఏదైనా ట్రస్టు తరఫున ట్రస్టీ హోదాలో ఆస్తులు కొంటే, కలిగివుంటే... ఏవేవి బినామీ లావాదేవీల పరిధిలోకి వస్తాయి.. స్థిర, చరాస్తులు, ఏవేవీ హక్కులు (మేధో హక్కులు, కాపీరైట్ హక్కుల లాంటివి), బంగారు బాండ్లు, ఫైనాన్షియల్ సెక్యూరిటీలు... తదితరమైనవి ఇతరుల పేరిట కొంటే బినామీ లావాదేవీ కిందకు వస్తాయి. ఎలా నిర్ధారిస్తారు.. ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ లేదా డిప్యూటీ కమిషనర్... ఇనీషియేటింట్ ఆఫీసర్ (చర్యకు ఉపక్రమించే అధికారి)గా ఉంటారు. ఏదేని ఆస్తి బినామీ పేరిట ఉందని తమకు అందిన సమాచారంతో లేదా ఏదైనా లావాదేవీపై అనుమానం వచ్చినపుడు పూర్వాపరాలను పరిశీలించుకొని... సదరు బినామీకి నోటీసు జారీచేస్తారు. నోటీసులో పేర్కొన్న ఆస్తి లేదా ఆస్తులు కొనడానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాలని, ఆధారాలు చూపాలని కోరుతారు. పై అధికారి అనుమతితో సదరు ఆస్తిని స్తంభింపజేస్తారు (ఈ ఆస్తిపై తదుపరి లావాదేవీలకు వీలుండదు). విచారణలో అడ్జుకేటింగ్ అథారిటీ సదరు ఆస్తిని 'బినామీ'గా ప్రకటిస్తే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ ఏడాదిలోపు విచారణ పూర్తిచేసి తీర్పునివ్వాలి. ట్రిబ్యునల్ తీర్పును కూడా సవాల్ చేయదలిస్తే హైకోర్టు గడప తొక్కవచ్చు. శిక్షలు... 1. బినామీ పేరిట (మరొకరి పేరిట) ఆస్తులు కొన్నట్లు రుజువైతే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. 2. సదరు బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం జరిమానాగా చెల్లించాలి. 3. ఇలాంటి బినామీ లావాదేవీ గురించి తెలిసీ ఇతరులకు తప్పుడు సమాచారమిచ్చిన వారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు కారాగార శిక్ష, ఆస్తి విలువలో పదిశాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి. 4. బినామీ ఆస్తిని ఎలాంటి పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 5. బినామీల పేరిట ఆస్తులు కొంటే... డబ్బు చెల్లించింది తానేనని, తన ఆస్తిని తనకు ఇప్పించండని కోరే హక్కు అసలు యజమానికి ఉండదు. అలా కోరడం నిషిద్ధం. పర్యవసానాలు: అక్రమ సంపాదన, అవినీతి సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది మరో షాక్. ఏదో రకంగా వీటిని అమ్ముకొని బయటపడదామని చూసినా... అది ఇప్పట్లో కుదరదు. కొనే వ్యక్తి కొత్తనోట్లతో భారీగా నగదును ముట్టచెప్పలేడు. చెక్కు ద్వారా చెల్లింపు జరపాలంటే... కొనే వ్యక్తి సంపాదన సక్రమమై ఉండాలి. దానికి ఆదాయపు పన్ను చెల్లించి ఉండాలి. చట్టం పదునెక్కినందువల్ల బినామీ ఆస్తిని తనదిగా చెప్పుకోలేడు. పత్రాల్లో పేరున్న యజమాని అడ్డం తిరిగి వాస్తవం చెబితే జైలే గతి. ఏడేళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశమున్నందున తేలు కుట్టిన దొంగల్లా సదరు ఆస్తి గురించి (అది తమ బినామీ ఆస్తి అయినా సరే) తమకేమీ తెలియనట్లు ఉండిపోక తప్పదు. శిక్షలకు భయపడి ఇలాంటి బినామీ ఆస్తులు వదులుకోవాల్సి రావొచ్చు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ తదుపరి టార్గెట్ ఏంటో తెలుసా?
రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. త్వరలోనే మరో సంచలనం రేపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న బినామీ లావాదేవీలపై కొరడా ఝళిపించడానికి మోదీ సై అంటున్నారు. లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు మొత్తాన్ని పన్ను పరిధిలోకి తేవాలని చేస్తున్న విప్లవాత్మక చర్యలలో భాగంగా బినామీ లావాదేవీలపై కన్ను పెట్టబోతున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచే బినామీ లావాదేవీలపై కఠిన చర్యలు మొదలవుతాయని సమాచారం. ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి అన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలన్నది మోదీ వ్యూహంలా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పథకాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలను చేపట్టాలని, అది కూడా శరవేగంగా చేపట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది. బినామీ ఆస్తుల విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గే సమస్య లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనివల్ల తాత్కాలికంగా రాజకీయ వ్యతిరేకత వచ్చినా, దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయన్నది సర్కారు భావనగా తెలుస్తోంది. ఈ విషయమై సోమవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా విస్తృతంగా చర్చ జరిగిందంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జాతీయవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సమావేశం తర్వాత తెలిపారు. నల్లధనంపై సిట్ వేయడం, రెండుసార్లు పన్నులు విధించే పద్ధతిని రద్దుచేయడం, బినామీ లావాదేవీల రద్దు బిల్లు ప్రవేశపెట్టడం లాంటి చర్యలుంటాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. -
బినామీ లెక్కలేవీ బాబూ: వినోద్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: బినామీల పేర్ల మీదున్న ఆస్తుల వివరాలు చెప్పకుండా అవే పాత లెక్కలను చంద్రబాబునాయుడు చెప్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీచేసిన వారందరి ఆస్తుల వివరాలు వెబ్సైట్లలో ఉన్నాయన్నారు. కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు సహా ఏవైనా తప్పు చెప్తే అనర్హతకు గురౌతారని కూడా ఎన్నికల సంఘం చెప్తోందని వివరించారు. ఆస్తులను చంద్రబాబు ఒక్కరే ప్రకటించినట్టు, మిగిలినవారూ ప్రకటించాలని సవాల్ విసరడం అందరికీ నవ్వు తెప్పిస్తోందని వినోద్‌కుమార్ అన్నారు. చంద్రబాబు చెప్పిం దాంట్లో కొత్తేమీ లేదన్నారు. బినామీ ఆస్తుల వివరాలను కూడా చంద్రబాబుకు దమ్ముంటే వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు.