ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: పీఎన్‌బీ మోగా స్కాం రేపిన ప్రకంపనలు జ్యుయలరీ షేర్లకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. వేలకోట్ల స్కాంలో కీలకు నిందితుడైన మెహుల్ చెక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ శుక్రవారం కూడా ఢమాల్ అంది. వరుసగా మూడో సెషన్‌లో అమ్మకాల వెల్లువ సాగడంతో 52వారాల కనిష్టాన్ని తాకింది. గీతాంజలి జెమ్స్ 20శాతం కుదేలైంది. ఇతర ఆభరణాల షేర్లలో తంగమైయిల్ జ్యువెలరీ 5 శాతం , త్రిభువన్ దాస్ భీంజీ జవేరి (టీబీజెడ్) 3శాతం, రాజేష్ ఎక్స్‌పోర్ట్ 1 శాతం నష్టపోయింది. పీసీ జ్యువెలర్స్ మాత్రం పాజిటివ్‌గా ట్రేడ్‌అయింది.
కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ముంబై బ్రాంచీలో జరిగిన 177 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11,400 కోట్లు) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్‌మై కూడా కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మరోసారి భారీ అమ్మకాలకు తెరతీశారు. గీతాంజలి, గిన్ని, నక్షత్ర, నీరవ్‌మోదీ లాంటి అతిపెద్ద జ్యువెలర్స్‌నుపరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. వివిధ బ్యాంకులతో వారి లావాదేవీలను సీబీఐ, ఈడీ పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ముంబై బ్రాంచీలో కుంభకోణం పీఎన్‌బీ షేరు సైతం వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. 2శాతం పతనమైంది.
అటు ఈ భారీ స్కాం వెలుగు చూడటంలో మార్కెట్ రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ ప్రారంభించింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే చోక్సీ తో సహా నీరవ్ మోదీకి మోడీకి అన్ని సంస్థల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, తదితర అంశాల విశ్లేషణ మొదలు పెట్టింది. సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని రెగ్యులేటరీ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment