Mega Scam
-
అసలు పాపం వారిదే..నీరవ్‌ను వదిలిపెట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. దావోస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార వేత్తలతో దిగిన ఫోటోలో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ఉండటంపై విమర్శలకు దిగిన కాంగ్రెస్‌కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందన్నారు. గీతాంజలి ఆభరణాల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నవిషయాన్నిగుర్తు చేసిన ఆమె రాహుల్‌పై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ స్కాంలో అసలు పాపం అంతా కాంగ్రెస్‌దేనని, దాన్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీపై ఎదురు దాడిచేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి భార్యకు భార్య అనితా సింగ్‌కు నీరవ్ మోదీకి చెందిన కంపెనీలో షేర్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. నీరవ్ మోదీ కంపెనీలలో ఒకటైన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనితా సింఘ్వి ,(కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి భార్య) , కుమారుడు అవిష్కార్ సింఘ్వి డైరెక్టర్లుగా ఉన్న అద్వైతా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్ హోల్డింగ్స్ స్థలాన్ని 2002 నుంచి అద్దెకు ఇచ్చారని, రెండు కంపెనీల మధ్య రుణ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఇందులో ప్రమోటర్లుగా కాంగ్రెస్‌వారే లబ్ధి దారులుగా ఉన్నారని ఆరోపించారు. వారసత్వ, వారసత్వ ఆస్తులు అన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవని ఆమె ఆరోపించారు. అలాగే మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ దేశం విడిచిపారిపోయినా, పట్టుకుని తీరతామన్నారు.ఆయన్ను అరెస్టు చేసేందుకవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీరవ్ మోదీ సహా అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. కుంభకోణాలకు పాల్పడిన క్షమించే ప్రసక్తే లేదనీ, శిక్షించి తీరుతామన్నారు. -
మెగా స్కాం: ఢమాలన్న గీతాంజలి
సాక్షి, ముంబై: పీఎన్బీ మోగా స్కాం రేపిన ప్రకంపనలు జ్యుయలరీ షేర్లకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. వేలకోట్ల స్కాంలో కీలకు నిందితుడైన మెహుల్ చెక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ శుక్రవారం కూడా ఢమాల్ అంది. వరుసగా మూడో సెషన్లో అమ్మకాల వెల్లువ సాగడంతో 52వారాల కనిష్టాన్ని తాకింది. గీతాంజలి జెమ్స్ 20శాతం కుదేలైంది. ఇతర ఆభరణాల షేర్లలో తంగమైయిల్ జ్యువెలరీ 5 శాతం , త్రిభువన్ దాస్ భీంజీ జవేరి (టీబీజెడ్) 3శాతం, రాజేష్ ఎక్స్పోర్ట్ 1 శాతం నష్టపోయింది. పీసీ జ్యువెలర్స్ మాత్రం పాజిటివ్‌గా ట్రేడ్‌అయింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో జరిగిన 177 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11,400 కోట్లు) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్‌మై కూడా కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మరోసారి భారీ అమ్మకాలకు తెరతీశారు. గీతాంజలి, గిన్ని, నక్షత్ర, నీరవ్‌మోదీ లాంటి అతిపెద్ద జ్యువెలర్స్‌నుపరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. వివిధ బ్యాంకులతో వారి లావాదేవీలను సీబీఐ, ఈడీ పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ముంబై బ్రాంచీలో కుంభకోణం పీఎన్బీ షేరు సైతం వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. 2శాతం పతనమైంది. అటు ఈ భారీ స్కాం వెలుగు చూడటంలో మార్కెట్ రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ ప్రారంభించింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే చోక్సీ తో సహా నీరవ్ మోదీకి మోడీకి అన్ని సంస్థల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, తదితర అంశాల విశ్లేషణ మొదలు పెట్టింది. సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని రెగ్యులేటరీ అధికారి తెలిపారు. -
మరో 8మంది అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో తాజాగా మరో ఎనిమిదిమంది అధికారులపై వేటు పడింది. అనుమానిత లావాదేవీలు జరిపారన్న ఆరపణలతో ఒక జనరల్ మెనేజర్ సహా ఎనిమిదిమందిని సస్పండ్ చేసినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ మెగా స్కాంలో మొత్తం సస్పెండ్ అయిన పీఎన్బీ అధికారులు సంఖ్య 18కి చేరింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి ఇతర బ్యాంకుల పూర్తి బకాయిలను చెల్లించాల్సిన నేపథ్యంలో అంతర్గత వనరుల ద్వారా నిధులు సమకూరుస్తామని కూడా ఆ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సంబంధిత 36 అకౌంట్ ఖాతాలపై దర్యాప్తు చేయనుందని తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎల్వోయూ ( బ్యాంకింగ్ పరిభాషలో ఎల్వోయూ అనేది ఇతర బ్యాంకుల శాఖలకు ఒక బ్యాంక్ జారీచేసే ఒక హామీ. ఈ ఎల్ఓయూ ద్వారా విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను అందిస్తాయి) కింద క్రెడిట్ అయిన నిధులను పూర్తిగా చెల్లిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పీఎన్బీకి రూ. 5,473 కోట్లను ప్రకటించినట్టు చెప్పారు. -
మెగా స్కాం: నీరవ్‌మోదీ ఎపుడో చెక్కేశాడు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి సంబంధించి ఆసక్తికరవిషయం వెలుగు చూసింది. నీరవ్ మోసపూరిత లావాదేవీలపై ఎఫ్ఐఆర్ దాఖలు కాకముందే దేశాన్ని విడిచి వెళ్లిపోయాడని విదేశాంగ శాఖ ప్రకటించింది. సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అంటే జనవరి 1 నే నీరవ్‌మోదీ స్విట్జర్లాండ్‌కు చెక్కేశాడు. అతని సోదరుడు నిశాల్మోదీ(బెల్జియన్ సిటిజన్) భార్య అమి మోదీ (అమెరికన్ సిటిజన్) కూడా ఆ రోజే విదేశీ విమానం ఎక్కేశారు. అయితే ప్రధాన వాటాదారుడు , గీతాంజలి జ్యెవెలరీ ప్రమోటర్ మెహుల్ చోస్కీ జనవరి 6న దేశం విడిచాడని అధికారులు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరి 29న సీబీఐ కి ఫిర్యాదు చేయగా.. రూ. 280 కోట్ల అవినీతి కేసులో జనవరి 30న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్థిక శాఖ స్పందన మరోవైపు తాజా పరిణామాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ సీరియస్‌గా స్పందించింది. పీఎన్బీలో మెగా స్కాం వెలుగు చూడటం గవర్నెన్స్ లోపాలను వెల్లడించిందని శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్,ఎస్బీఐలోని పాలనా లోపాలను ప్రస్తావించారు. అలాగే సంబంధిత ఖాతాలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. ఈడీ, ఆర్బీఐ సీరియస్ అలాగే నీరవ్ మోదీ, ఆయన భార్య, మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఈడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ ప్రయత్నాల్లో విదేశాంగ శాఖ ఉంది. అటు మార్చి 2018నాటికి మొత్తం రూ.11వేల కోట్లను చెల్లించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎన్‌బీను ఆదేశించింది. దీంతో గురువారం నాటి మీడియా సమావేశంలో నిందితులను శిక్షస్తాం, వాటాదారుల సొమ్ముకు ఢోకాలేదంటూ డ్యామెజ్ కంట్రోల్ చేసుకున్నప్పటికీ తాజా పరిణామాలతో బ్యాంకు మరింత చిక్కుల్లో పడింది. రూ.5100 కోట్ల ఆస్తులు సీజ్ నీరవ్ మోదీకి చెందిన రూ. 5100 కోట్ల డైమండ్, బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్టుఈడీ ప్రకటించింది. అలాగే 3.9 కోట్ల బ్యాంక్ బాలెన్స్తోపాటు ఇతర డిపాజిట్లనుకూడా సీజ్ చేసినట్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచ్ కు సంబంధించిన రూ.11,400 కోట్ల భారీ స్కామ్ లో నీరవ్ మోదీ, ఆయన భార్య,సోదరుడు, మరో భాగస్వామి ప్రధాన వాటాదారుడు మెహుల్ చోస్కీ నిందితులు. పీఎన్బీ ఇచ్చిన హామీలతో వీళ్ళు ఆరు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, సూరత్ నగరాల్లో నీరవ్ కుటుంబానికి చెందిన 17 కార్యాలయాలమీద ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాగా 2017 లో తమ బ్యాంకును రూ. 280 కోట్ల మేర బురిడీ కొట్టించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ ఇదివరకే దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు 6 నెలల గడువు కావాలని నీరవ్ కోరినట్టు సమాచారం. అటు ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ 18మంది అధికారులను పీఎన్బీ సస్పెండ్ చేసింది. ఈ అవినీతి గురించి ఈడీకి రిపోర్ట్ చేసిన మొదటి బ్యాంకు పీఎన్బీ. Stock worth Rs 5100 Cr including Gold & Diamond jewellery, Precious stones etc recovered during searches was seized under PMLA. Certain records have also been resumed for further investigation. Bank balance worth Rs 3.9 crore in accounts & fixed deposits has also been freezed. — ANI (@ANI) February 15, 2018 ED writes to the Ministry of External Affairs seeking revocation of passports of #NiravModi, his wife #AmiModi & and #MehulChoksi. #PNBScam — ANI (@ANI) February 15, 2018 -
'పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?'
ముంబయి: పెద్ద నోట్లు రద్దు అనేది ఒక వ్యక్తి ఆలోచన ఆధారంగా చేసిన చర్య అని, ఇదొక భారీ కుంభకోణంగా మారవొచ్చని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 'పెద్ద మొత్తంలో నల్లడబ్బును ఉపయోగించే వారు(మాల్యా, లలిత్ మోడీ) ఎలాంటి పన్ను కట్టకుండానే ప్రధాని మోదీ సాయంతో విదేశాలకు పారిపోయారని ఆయన ఆరోపించారు. బుధవారం ఇక్కడ కోర్టులో హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి బాంద్రా వద్ద మీడియా ప్రతినిధులతో రాహుల్ మాట్లాడారు. తాను ఆర్థిక నిపుణులతో పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని చర్చించానని, ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించలేదని, కేవలం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆధారంగా దీనిని అమలుచేశారని చెప్పారు. ఎంతో సున్నితంగా దీనిని అమలు చేయాల్సిందని అన్నారు. 'నల్లడబ్బు కుబేరులు ఎవరినైనా మీరు బ్యాంకుల ముందు క్యూలో చూశారా? అక్కడ నిల్చున్నవారంతా రైతులు, ప్రభుత్వ సేవకులు, సాధారణ పౌరులు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకోవడంపట్ల స్పందన కోరగా తన పద్ధతి వేరు, మోదీ పద్ధతి వేరని, తాను మోదీ తల్లిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. 'రెండు రోజుల కిందట ప్రధాని తన ప్రసంగంలో నవ్వారు. మరో రోజు ఏడుస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. నేను సోషల్ మీడియాలో బీజేపీ నాయకుల చేతుల్లో పెద్ద మొత్తంలో డబ్బును చూస్తున్నాను. వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.