సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో తాజాగా మరో ఎనిమిదిమంది అధికారులపై వేటు పడింది. అనుమానిత లావాదేవీలు జరిపారన్న ఆరపణలతో ఒక జనరల్ మెనేజర్ సహా ఎనిమిదిమందిని సస్పండ్ చేసినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ మెగా స్కాంలో మొత్తం సస్పెండ్ అయిన పీఎన్‌బీ అధికారులు సంఖ్య 18కి చేరింది.
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి ఇతర బ్యాంకుల పూర్తి బకాయిలను చెల్లించాల్సిన నేపథ్యంలో అంతర్గత వనరుల ద్వారా నిధులు సమకూరుస్తామని కూడా ఆ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సంబంధిత 36 అకౌంట్ ఖాతాలపై దర్యాప్తు చేయనుందని తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎల్‌వోయూ ( బ్యాంకింగ్ పరిభాషలో ఎల్‌వోయూ అనేది ఇతర బ్యాంకుల శాఖలకు ఒక బ్యాంక్ జారీచేసే ఒక హామీ. ఈ ఎల్‌ఓయూ ద్వారా విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను అందిస్తాయి) కింద క్రెడిట్ అయిన నిధులను పూర్తిగా చెల్లిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పీఎన్‌బీకి రూ. 5,473 కోట్లను ప్రకటించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment