ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రముఖ ఆభరణాల సంస్థ గీతాంజలి జెమ్స్ దూసుకుపోయింది. ఏకీకృత నికర లాభాల్లో దాదాపు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో రూ 57 కోట్ల నికర లాభాలను గడించినట్టు వెల్లడించింది. గత ఏడాది రూ 19.91 కోట్లుగా ఉంది. దాని నికర ఆదాయం రూ. 3,710 కోట్లకు పెరిగిందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. 2016-17 సంవత్సరం ఏప్రిల్- జూన్ కాలంలో ఇది రూ.2,845 కోట్లు. ఇక నికర అమ్మకాలపరంగా ఈసారి రూ.2,595 కోట్లను రాబట్టిన సంస్థ..నిరుడు రూ.1,866 కోట్లను అందుకుంది. ఆభరణాల వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించింది. రూ. 2,165 నుంచి 2,950 కోట్లకు పెరిగింది. డైమండ్ సెగ్మెంట్లో ఆదాయం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ 848,67 కోట్ల నుంచి రూ 834,82 కోట్లకు తగ్గింది.
కాగా దేశీయంలో సుమారు నాలుగువేలకు పైగా విక్రయ కేంద్రాల ద్వారా గీతాంజలి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అలాగే యూరోప్ , పశ్చిమ ఆసియాతోపాటు అమెరికా, చైనా,జపాన్ లలో స్టోర్స్ ఉన్నాయి.