సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. రూ. 148 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం అటాచ్ చేసింది. ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెట్‌కు 147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రూ.50కోట్ల విలువైన అమృతా షెర్-గిల్, ఎం.ఎఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ కళాకారుల పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కింద ఈడీ ఈ చర్య చేపట్టింది. మోదీ అతని కంపెనీలకు చెందిన ఎనిమిది కార్లు, ప్లాంట్, మెషీన్లు, బంగారు ఆభరణాలు, పెయింటింగ్స్‌తోపాటు ఇతర స్థిరమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విదేశాల్లో నీరవ్‌కు చెందిన 1725 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే ఈడీ ఎటాచ్ చేసింది.
కాగా రూ.14వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంలో నీరవ్‌మోదీతోపాటు, ఆయన మేనమామ గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ ప్రధానంగా నిందితులుగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసులు నమోదు చేశాయి. వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన నీరవ్, చోక్సీలను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment