పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ నిందితుడు నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. నీరవ్‌మోదీ చెల్లెలు పూర్వి మోడీ ఈడీకి అప్రూవర్‌గా మారింది. పూర్వి మోడీ యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి ₹17 కోట్లకు పైగా నగదును భారత ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. "పూర్వి మోడీ(నీరవ్ మోడీ సోదరి) యుకె బ్యాంక్ ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలిచేశారు. దీంతో నీరవ్‌మోదీ లండన్ అకౌంట్స్ నుంచి రూ.17.25 కోట్లు రికవరీ చేసినట్లు" దర్యాప్తు సంస్థ పేర్కొంది.
జూన్ 24న పూర్వి మోడీ తన పేరిట యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్లో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినట్లు, తన సోదరుడు నీరవ్‌మోదీ ఆదేశాల మేరకు ఖాతా ఓపెన్ చేసినట్లు, అందులో ఉన్న నిధులు తనకు చెందినవి కాదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు తెలియజేసింది. కొన్ని షరతులతో ఈడీ ఆమెకు క్షమబిక్ష పెట్టింది. ఈడీకి అప్రూవర్‌గా మారిన పూర్వి మోడీ తన యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలీ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నీరవ్ మోడీ ప్రస్తుతం యుకె జైలులో ఉన్నారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) నుంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.13,000 కోట్లు తీసుకొని బ్రిటన్ కు పారిపోయాడు. కొద్ది రోజుల క్రితం భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో చేసుకున్న అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment