
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ నివాస భవనాన్ని ఇవాళ (శుక్రవారం) అధికారులు కూల్చివేశారు. అలీబాగ్‌లో విలాసవంతమైన బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ సూర్యవంశి,ఇతర అధికారుల సమక్షంలో పూర్తిగా నేలమట్టం చేశారు. బిల్డింగ్ బుల్‌డోజర్లకు లొంగక పోవడంతో, ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరీ పని పూర్తి చేశారు. దీంతో డైమండ్ కింగ్ ఆశల సౌధం కుప్పకూలింది.
శక్తివంతమైన దాదాపు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను ధ్వంసం చేశారు. రూ.33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ బంగ్లాను నాణ్యమైన సిమెంట్‌తో నిర్మించడంతో బుల్‌డోజర్లతో కూల్చడం కష్టమని భావించిన అధికారులు డైనమైట్లతో పూర్తిగా పడగొట్టారు. ఈ భవనం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ భవనాన్ని ఈడీ ఎటాచ్ చేసింది కూడా.



Comments
Please login to add a commentAdd a comment