
లండన్: బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన అతను సంచలన వ్యాఖ్యలతో మరో డ్రామాకు తెరలేపాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు మెరపెట్టిన నీరవ్.. భారత్‌కు అప్పగిస్తే తనకు ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించాడు. కాగా, ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు లండన్ కోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది.
ఇదిలా ఉంటే, బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న నీరవ్ మోదీ.. ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో అతన్ని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. భారత్‌లో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment