ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని ’పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి’గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో మోదీ ఆస్తుల జప్తునకు మార్గం సుగమమైంది.
2018లో ఎఫ్‌ఈవో చట్టం వచ్చిన తర్వాత.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తర్వాత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది నీరవ్ మోదీకే. పీఎన్‌బీ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోయారు. 2019 మార్చిలో లండన్‌లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తనను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment