న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13వేలకోట్లు ఎగ్గొట్టి పరారైన వజ్రాలవ్యాపారి నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. తన సంస్థలోని ఒక డమ్మీ డైరెక్టర్‌ను నీరవ్ బెదిరించారని మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని కైరో నుంచి ఇండియాకు తిరిగొస్తే చంపేస్తానని డైరెక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్ భాయ్ లాడ్‌ను నీరవ్ బెదిరించాడని తెలిపింది. బ్యాంకు స్కామ్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాడ్ దుబాయ్ నుంచి కైరోకు పారిపోయాడు. తర్వాత 2018లో భారత్‌కి తిరిగి రావాలని అనుకున్నప్పుడు నీరవ్ తరఫున నేహాల్ మోదీ బెదిరించాడని వెల్లడించింది. యూరప్ కోర్టులో జడ్జి ముందు నీరవ్‌కి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని, దీనికి లాడ్‌కు నేహాల్ రూ.20 లక్షలు ఇవ్వజూపారని, అయితే దీనిని లాడ్ తిరస్కరించాడని సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment