ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాను భారత్‌కు తిరిగిరాలేనని నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తెలిపారు. భారత్‌లో తన ప్రాణాలకు భద్రత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది న్యాయస్థానంలో ఈ మేరకు స్పందించారు. ఈ వ్యవహారంలో తానే దోషి అన్నట్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారని నీరవ్ పిటిషన్‌లో తెలిపారు. తాను చేసిన సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా పీఎన్‌బీ అధికారులు క్రిమినల్ లావాదేవీలుగా కలరింగ్ ఇచ్చారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment