Offender
-
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
తన కూతురు ఆత్మహత్యకు సూర్య తేజనే కారణం
-
ఝాన్సీ ఆత్మహత్యకు అతడే కారణం
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసును పోలీసుల చేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఝాన్సీ ఇంటిని తనిఖీ చేసిన పంజాగుట్టు పోలీసులు కుటంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అనంతరం కుటుబంసభ్యులతో సహా పలువురిని విచారించారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ సంభాషణలపై దృష్టి సారించిన పోలీసులు.. అమె ప్రియుడు సూర్య ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝన్సీ సెల్‌ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసుల ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే కారణమని తేల్చారు. దీంతో సూర్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం
-
క్రిమినల్ లావాదేవీలుగా చూపారు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాను భారత్‌కు తిరిగిరాలేనని నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తెలిపారు. భారత్‌లో తన ప్రాణాలకు భద్రత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది న్యాయస్థానంలో ఈ మేరకు స్పందించారు. ఈ వ్యవహారంలో తానే దోషి అన్నట్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారని నీరవ్ పిటిషన్లో తెలిపారు. తాను చేసిన సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా పీఎన్బీ అధికారులు క్రిమినల్ లావాదేవీలుగా కలరింగ్ ఇచ్చారని ఆరోపించారు. -
మాల్యాకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతకేసులో తనను పరారీలో ఉన్న నేరస్ధుడిగా ఈడీ ప్రకటించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాలను చెల్లించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని, తనపై విచారణను నిలిపివేయాలని విజయ్ మాల్యా ఈ ఏడాది నవంబర్ 22న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదని సెప్టెంబర్‌లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్ట (పీఎంఎల్ఏ) న్యాయస్ధానానికి నివేదించారు. మనీల్యాండరింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. రూ 9000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు మాల్యాపై అభియోగాలు నమోదు చేశాయి. న్యాయస్ధానాలు ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించడంతో లండన్‌లో తలదాచుకున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. మాల్యా అప్పగింతపై వచ్చేవారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తాను బ్యాంకు రుణాల అసలు మొత్తం చెల్లించేందుకు సిద్ధమని, తన ప్రతిపాదనను బ్యాంకులు అంగీకరించాలని రెండు రోజుల కిందట మాల్యా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్‌సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు. వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. -
నో కామెంట్ ప్లీజ్!
దురుసుగా పరుగెడితే కాలు మడత పడొచ్చు మన కాలేగా. రిపేర్ చేసుకోవచ్చు. కానీ, అదే దురుసుతో నాలుక పరిగెడితే మడత పడదుగానీ మడతలు పెట్టొచ్చు బీ కేర్ ఫుల్.. నో కామెంట్ ప్లీజ్! కాల్డేటాయే కాదు సెల్‌టవర్ టెక్నాలజీ కూడా నేరస్తుడిని పట్టిస్తుంది అని నిరూపించారు కాజిపేట పోలీసులు ఏసీపీ జనార్ధన్ అండ్ టీం (మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది జి. దేవేందర్, బి. సాంబయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్). నేరస్తుడికి శిక్ష పడేలా వృత్తిధర్మం నిర్వహించారు. మాట హత్యకు దారి తీయవచ్చు.మాట హంతకుణ్ణి పట్టి ఇవ్వవచ్చు కూడా.మిట్టమధ్యాహ్నం.కాజీపేట స్టేషన్.ఏసీపీ ఎదురుగా ఓ కేసు తాలూకు ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ను చూస్తే అతనికి కోపం. చికాకు. అసహనం. ఏడాది నుంచి అది అతని టేబుల్ మీద పడి ఉంది. కేసు తేలదు. ఫైల్ క్లోజ్ కాదు. క్లోజ్ కాని ఏ ఫైల్ అయినా పోలీసు గుండెల మీద ఫిరంగే.ఇన్స్పెక్టర్ వచ్చి రొటీన్‌గా సెల్యూట్ చేశాడు. ఏసీపీ ఆ ఫైల్ వైపు చూపుడు వేలు ఆడించి అన్నాడు–‘ఏంటయ్యా ఇది. ఒక్క క్లూ కూడా దొరకుండా అంత పకడ్బందీగా మర్డర్ ఎలా చేశారు? ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చోట దొరికి తీరాల్సిందే కదా. అసలు నేరస్తుడు ఎవరో ఇంతవరకూ పట్టుకోకపోతే ఇక మనమెందుకు. ఏం... రిజైన్ చేసి వెళ్లిపోదామా’...ఇన్స్పెక్టర్ ఏమీ అనకుండా స్టడీగా నిలుచున్నాడు.ఏసీపీ కే సు తాలూకు ఫైల్ మీద చేత్తో గట్టిగా తడుతూ మళ్లీ ఓపెన్ చేశాడు. కేస్ ఫైల్ తేదీ: 2016 సెప్టెంబరు 14. మృతుడు: పులిగిల్ల చందు. వయసు: 19 జరిగింది: హత్య. చేసినవారు: ఆధారాలు లభించలేదు. మూసేశాడు. ‘ఛాన్సే లేదు. ఏదో ఒక క్లూ దొరకాల్సిందే. ఏంటా క్లూ. సాక్ష్యాధారాలతో నేరస్తుడిని పట్టుకుతీరాలి. ఎలా?’ తనలో తనే అనుకుంటూ గట్టిగా పైకే విసుక్కున్నాడు. 2016 సెప్టెంబర్ 13.గణేష్ నిమజ్జనంలో పోలీసులకు ఊపిరి సలపనంత పనిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బృందమంతా వేయికళ్లతో పహారా కాస్తోంది. తెల్లవార్లూ నిమజ్జన హడావిడితో కంటి మీద కునుకు కూడా లేదు.మరుసటి రోజు. నిమజ్జనం సజావుగా సాగినందుకు పోలీసులు అప్పుడప్పుడే ఊపిరి తీసుకుంటున్నారు. ఇంతలో ఫోన్ మోగింది.ఎత్తి ‘హలో’ అన్నాడు కానిస్టేబుల్.అటువైపు ఎవరో అపరిచితుడు.‘భట్టుపల్లి కోటచెరువు దగ్గర ముళ్లపొదల్లో ఎవరిదో బాడీ పడి ఉందండీ. చూస్తే కుర్రాడిలా ఉన్నాడు’పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి చాలామంది పోగై ఉన్నారు. పంతొమ్మిది ఇరవై ఏళ్ల కుర్రాడి శవం పడి ఉంది. శవం పడి ఉన్న తీరు చూస్తే ఏదో ఆయుధంతో హత్య చేసినట్టు అర్థమవుతోంది.కాసేపటికి ఆ కుర్రాణ్ణి జనంలో ఎవరో గుర్తించారు.‘వీడు చందులా ఉన్నాడే’వెంటనే చందు తల్లిదండ్రులకు సమాచారం అందింది. చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి వాళ్ల దుఃఖానికి అంతులేదు. ‘మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరిపైన అయినా అనుమానం ఉందా’ పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లి ‘అయ్యా! నా బిడ్డ ఎవరితోనూ గొడవకు పోయే రకం కాదు’ ఏడుస్తూనే చెప్పింది. తల్లీదండ్రి నుంచి వివరాలు తీసుకొని, శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. చందు ఫోన్ కాల్స్ ఆధారంగా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ రోజు అతనితో ఫోన్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. దర్గా కాజీపేట సెల్‌ఫోన్ టవర్ల పరిధిలోని అన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌ను సేకరించి, విశ్లేషించారు. అనుమానితులుగా అనిపించిన 12 మందిని విచారించారు. వారికి ఏ సంబంధం లేదని తేలింది. చందు నివసించే దర్గా కాజీపేటలో ఇరుగుపొరుగు వారినీ ప్రశ్నించారు. ‘ఆ పిల్లాడు చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు’ అని జవాబు వచ్చింది. కేసు ఇంకా క్లిష్టంగా మారింది.ఫైల్ చూస్తున్న ఏసీపీ కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. మృతుడి స్నేహితులను, ఇరుగుపొరుగును విచారించినా ఏమీ తెలియలేదు. కాల్‌డేటా ద్వారా కూడా ఎటువంటి క్లూ లభించలేదు.. ఇంకేమిటి దారి అనుకుంటూ ఉంటే ‘టవర్ లొకేషన్ టెక్నాలజీ’ గుర్తుకొచ్చింది.ఇన్స్పెక్టర్ని పిలిచాడు.హతుడు పడి ఉన్న చోట ఆ సమయంలో అక్కడి టెలిఫోన్ టవర్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్ల వివరాలను టవర్ లోకేషన్ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ యాంగిల్లో ట్రై చేద్దాం’ అన్నాడు.ఇన్స్పెక్టర్ తల ఊపాడు.పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయం రాత్రి 11 గంటలు. శవాన్ని చెరువు దగ్గర పడేశారంటే మరో అరగంట పట్టే ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న సెల్ టవర్ లోకేషన్ మ్యాప్‌ను టెలికాం ఆపరేటర్ల నుంచి తెప్పించారు. ఆ సమయంలో సెల్‌టవర్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్న వేలాది నెంబర్లను తరచి తరచి చూశారు. అన్నింటిని వడపోయగా హత్య జరిగిన సమయంలో, సంఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి ఫోన్ సిగ్నల్ యాక్టివ్‌గా ఉన్నట్టు తేలింది.అతని పేరు గుగులోతు శివ.శివను విచారించారు పోలీసులు. అతను చెప్పినది విన్నాక చందూకి, గుగులోతు శివకు ఎటువంటి çశతృత్వమూ లేదని తెలిసింది. కానీ, పోలీసులకు అనుమానం పోలేదు.శివ చెప్పిన వివరాలతో వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.గుగులోతు శివ మరో యువకునితో హోండా అక్సెంట్ కారులో పదే పదే తిరగడం కనిపించింది.ఎవరా అని ఆరా తీస్తే అతని పేరు రాంకీ అని తేలింది. కాల్స్ అన్నీ వీళ్లిద్దరి మధ్య నడిచాయి.ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ‘ఎందుకు చంపారు’ అడిగారు పోలీసులు.రాంకీ వైపు చూశాడు శివ.‘ఏమిటి కారణం?’ రాంకీని అడిగారు.‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను కామెంట్ చేశాడు’ అన్నాడు రాంకీ.ఒక కామెంట్ హత్య దాకా వచ్చింది. వర్థన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ దర్గా కాజీపేట లో ఉండే తన బావ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అక్కడే ఒకమ్మాయితో ప్రేమలోపడ్డాడు. 2016 సెప్టెంబరు 13న వినాయక నిమజ్జనంలో రాంకీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డాన్స్ చేశాడు. ఆ టైంలో చందు అక్కడే ఉన్నాడు.చూసి ఊరుకుని ఉంటే బాగుండేది.అమ్మాయిని కామెంట్ చేశాడు.‘ఏంట్రా కూశావ్’ అని రాంకీ చందూ కాలర్ పట్టుకున్నాడు. ఏదో మామూలు నిమజ్జనం గొడవ అనుకున్న చుట్టుపక్కలవాళ్లు వాళ్లను విడిపించారు. కాని రాంకీ తన కోపాన్ని వీడలేదు. తన లవర్ని కామెంట్ చేసినవాడిని హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దర్గా కాజిపేటలో ఉండే ఫ్రెండ్ గుగులోతు శివ ద్వారా చందును పిలిపించాడు. ‘‘గొడవలొద్దు, అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్‌లా కలిసిపోదాం. పార్టీ చేసుకుందాం’’ అన్నాడు. చందు సరే అనడంతో ముగ్గురూ కలిసి వర్థన్నపేట వరకు వెళ్లారు. అక్కడ తన ఇంట్లో పదునైన ఇనుప చువ్వను చందు చూడకుండా కారులో పెట్టాడు రాంకీ. కారులోనే ముగ్గురూ మద్యం సేవించారు. చందును రెచ్చగొట్టి బాగా తాగించారు శివ, రాంకీలు. చందు మత్తులోకి వెళ్లాడు. వెంటనే ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణారహితంగా రాంకీ దాడి చేశాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత కారులోనే రోడ్లన్నీ తిరిగి తిరిగి చివరకు భట్టుపల్లి కోటచెరువు ముళ్ల పొదల్లో మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఇనుపచువ్వను స్వాధీనం చేసుకొని, 2017 అక్టోబరు నాటికి నిందుతులకు బేడీలు వేసి కోర్టుముందు హాజరుపరిచారు పోలీసులు. – కృష్ణ్ణగోవింద్, బ్యూరో ఇంచార్జీ, సాక్షి, వరంగల్ -
కాకినాడ పోలీసుల ఝలక్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పోలీసులకు కాకినాడ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నెల్లూరు జరిగిన చోరీ కేసులో నిందితుడి సమాచారం ఇచ్చి తమకు అప్పగించాలని కోరితే అందుకు అంగీకరించిన కాకినాడ సీసీఎస్ పోలీసులు ఆ క్రిడెట్ దక్కించుకునేం దుకు అక్కడే అరెస్ట్ చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఈ నెల 4వ తేదీ ట్రంకురోడ్డులోని జ్యుయలరీ షాపులో చోరీకి యత్నం జరిగిన విషయం విదితమే. ఆ షాపులోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించగా నిందితుడి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన పాత నేరస్తులు లడ్డూ బ్రదర్స్‌లో ఒకరు కట్టా శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 5వ తేదీ తెల్లవారు జామున నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో భారీ చోరీ జరిగింది. రూ.34.43 లక్షల సొత్తు అపహరణకు గురైంది. రెండు ఘటనలు ఒకే తరహాలో ఉండటంతో నింది తుడు శివశంకర్‌గా నిర్ధారించారు. దీంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నిందితుడి వివరాలను కాకినాడ సీసీఎస్ పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో సమాచారం అందించినా లేదా పట్టించినా ఒకటేనని సూచించారు. దీంతో కాకినాడ పోలీసులు శివశంకర్ అసోసియేట్ కట్టా సత్తిబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడి పోలీ సులు నిందితుడి ఫోన్ నంబర్ టవర్లొకేషన్ ఆధారంగా యానం పోర్టు సమీపంలో ఉండగా మూడు రోజుల కిందట నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు వస్త్ర దుకాణంలో చోరీకి గురైన సొత్తులో 90 శాతంకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో రికవరీ ఉండటం, నిందితుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ నాలుగు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో అక్కడే అరెస్ట్ చూపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ కాకినాడ సీసీఎస్ పోలీనులను ఆదేశించారు. తాము వివరాలు చెప్పితే అందుకు భిన్నంగా కాకినాడ సీసీఎస్ పోలీసులు వ్యవహరించడం నెల్లూరు పోలీసులకు మింగుడు పడటం లేదు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన అనంతరం నెల్లూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తమ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో నిందితుడి చిత్రాలు రెండు ఘటనలో నిందితుడైన శివశంకర్ అతని సోదరుడి ఫొటోలు రెండు రోజులుగా నగరంలోని అన్నీ వ్యాపార వర్గాలకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో హల్చల్ చేస్తున్నాయి. -
‘పరారీలో ఉన్న నేరస్తుడి’గా మాల్యా!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించే ప్రక్రియను ఢిల్లీలోని ఓ కోర్టు బుధవారం ప్రారంభించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం(ఫెరా) ఉల్లంఘనకు సంబంధించిన ఓ కేసులో మాల్యాను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెర్వాత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను ఆదేశించారు. డిసెంబర్ 18లోగా విచారణకు హాజరు కావాలనీ, ఇదే తాము మాల్యాకు ఇచ్చే చివరి అవకాశమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
చోరీ కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం
సీరోలు(కురవి) : దొంగతనం కేసులో పోలీసులు కొడతారనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని సీరోలు గ్రామంలో శుక్రవారం జరి గింది. పోలీసులు, నిందితుడి భార్య మల్లమ్మ, కుమారుడు ఉపేందర్ కథనం ప్రకారం.. సీరోలు గ్రామానికి చెందిన బోనాల రాంమూర్తి 24వ తేదీన కోళ్లు దొంగిలించాడంటూ అదే గ్రామానికి చెందిన ఈర్ల మైసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం రాంమూర్తిని సీరోలు పోలీసులు స్టేషన్‌కు పిలిపించి దుస్తులు విప్పి కూర్చోబెట్టారు. దీంతో తనను పోలీసులు కొడతారనే భయంతో వణికిపోయాడు. పుష్కరాల విధులకు వెళ్లి స్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ అతడిని దొంగతనం చేశావా? అని విచారించగా తాను చేయలేదని సమాధానమిచ్చాడు. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జమానత్ ఇవ్వడంతో రాంమూర్తిని ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఎలాగైనా పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తారని, కొడతారనే భయంతో మనోవేదనకు గురైన రాంమూర్తి చేను వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితికి చేరుకునేలోపు చేను వద్దే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటీన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీరోలు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఐదు కోళ్లు పోయాయని మైసయ్య అనే వ్యక్తి రాంమూర్తిపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాను ఆ సమయంలో పుష్కరాల విధుల్లో ఉన్నానని, స్టేషన్‌కు వచ్చాక విషయం తెలుసుకొని జమానత్పై రాంమూర్తిని ఇంటికి పంపించినట్లు తెలిపారు. అతడిని ఎవరూ కొట్టలేదని, కొట్టే ఆలోచన కూడా లేదన్నారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఉంటాడని తెలిపారు. -
మాల్యా నేరస్తుడేనన్నముంబై కోర్టు
ముంబైః బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయమాల్యా కేసును ప్రత్యేక ముంబైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. విజయమాల్యాపై మనీ లాండరింగ్ చట్టంకింద ఈడీ ఈ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కోట్లకొద్దీ బ్యాంకులనుంచి రుణం తీసుకొని మార్చి 2 వ తేదీన మాల్యా భారత దేశంనుంచీ దొంగతనంగా పారిపోయి, లండన్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి తిరిగి రావాలని పదే పదే సెంట్రల్ ఏజెన్సీనుంచి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విస్మరించి అవమానిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికీ మాజీ రాజ్యసభ సభ్యుడు మాల్యా పాస్‌పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం, అతడిని ఇండియాకు పంపించాలని బ్రిటన్ ను అభ్యర్థించింది. అయితే ఆ డిమాండ్ ను లండన్ తిరస్కరించింది. -
నిందితుడి ఆత్మహత్యాయత్నం
హత్యకేసులో దొరుతాననే భయమే కారణం అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించిన పోలీసులు పాలకొండ: ఓ మహిళ హత్యకేసులో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న అనుమానితుడు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణం నవోదయనగర్‌లో ఆమిటి ప్రమీల అనే మహిళ ఈ నెల 10న హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ హత్య జరిగిన నాటి నుంచి సమీప బంధువు గొడవ ఈశ్వర్రావు తప్పించుకు తిరుగుతున్నాడు. ఈశ్వర్ రావు వృత్తి రీత్యా వంట పని చేస్తాడు. విజయనగరం జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ మధ్య ఈశ్వర్ పోలీసులకు ఫోన్ చేసి 'ఈ హత్య నేనే చేశా.. దమ్ముంటే నన్ను పట్టుకోండి' అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఈశ్వర్రావుతో పాటు అతడి బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం రోజున ఈశ్వర్ సమీప బంధువుల ఇంటికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. దొరుకుతాననే భయంతో ఈశ్వర్రావు చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈశ్వర్రావుని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
సాక్షి, కాకినాడ : ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. ఐదు లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డి అన్నారు. డీఎస్పీ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ వాకలపూడి ఎస్సీ కాలనీకి చెందిన రాజనాల సన్యాసిరావు అలియాస్ నానాజీ పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాడన్నారు. నిందితుడిపై టూటౌన్ క్రైం స్టేషన్, సర్పవరం పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అతడిని శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ కింద అరెస్టు చేసి, 24.50 కాసుల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. ఐదు లక్షలు ఉంటుందన్నారు. వీటిలో నాలుగు బంగారు గాజులు, రెండు బ్రాస్ లెట్లు, ఒక నెక్లెస్, నల్ల పూసల దండ, ఒక ఉంగరం, ఐదు వెండి వస్తువులు, చెవి దుద్దులు, గొలుసు ఉన్నాయన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీఎస్ సీఐ ఆండ్ర రాంబాబు, క్రైం ఎస్సై కేవీ రామారావు, క్రైం హెడ్ కానిస్టేబుళ్లు గోవిందరావు, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శ్రీరామ్, వర్మలను డీఎస్పీ అభినందించారు.