నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పోలీసులకు కాకినాడ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నెల్లూరు జరిగిన చోరీ కేసులో నిందితుడి సమాచారం ఇచ్చి తమకు అప్పగించాలని కోరితే అందుకు అంగీకరించిన కాకినాడ సీసీఎస్ పోలీసులు ఆ క్రిడెట్ దక్కించుకునేం దుకు అక్కడే అరెస్ట్ చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఈ నెల 4వ తేదీ ట్రంకురోడ్డులోని జ్యుయలరీ షాపులో చోరీకి యత్నం జరిగిన విషయం విదితమే. ఆ షాపులోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించగా నిందితుడి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన పాత నేరస్తులు లడ్డూ బ్రదర్స్‌లో ఒకరు కట్టా శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 5వ తేదీ తెల్లవారు జామున నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో భారీ చోరీ జరిగింది. రూ.34.43 లక్షల సొత్తు అపహరణకు గురైంది. రెండు ఘటనలు ఒకే తరహాలో ఉండటంతో నింది తుడు శివశంకర్‌గా నిర్ధారించారు.
దీంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నిందితుడి వివరాలను కాకినాడ సీసీఎస్ పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడో సమాచారం అందించినా లేదా పట్టించినా ఒకటేనని సూచించారు. దీంతో కాకినాడ పోలీసులు శివశంకర్ అసోసియేట్ కట్టా సత్తిబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడి పోలీ సులు నిందితుడి ఫోన్ నంబర్ టవర్‌లొకేషన్ ఆధారంగా యానం పోర్టు సమీపంలో ఉండగా మూడు రోజుల కిందట నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు వస్త్ర దుకాణంలో చోరీకి గురైన సొత్తులో 90 శాతంకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో రికవరీ ఉండటం, నిందితుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ నాలుగు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో అక్కడే అరెస్ట్ చూపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ కాకినాడ సీసీఎస్ పోలీనులను ఆదేశించారు. తాము వివరాలు చెప్పితే అందుకు భిన్నంగా కాకినాడ సీసీఎస్ పోలీసులు వ్యవహరించడం నెల్లూరు పోలీసులకు మింగుడు పడటం లేదు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన అనంతరం నెల్లూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తమ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో నిందితుడి చిత్రాలు
రెండు ఘటనలో నిందితుడైన శివశంకర్ అతని సోదరుడి ఫొటోలు రెండు రోజులుగా నగరంలోని అన్నీ వ్యాపార వర్గాలకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment