న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించే ప్రక్రియను ఢిల్లీలోని ఓ కోర్టు బుధవారం ప్రారంభించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం(ఫెరా) ఉల్లంఘనకు సంబంధించిన ఓ కేసులో మాల్యాను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెర్వాత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను ఆదేశించారు. డిసెంబర్ 18లోగా విచారణకు హాజరు కావాలనీ, ఇదే తాము మాల్యాకు ఇచ్చే చివరి అవకాశమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment