నిందితుడి ఆత్మహత్యాయత్నం | The offender to commit suicide | Sakshi
Sakshi News home page

నిందితుడి ఆత్మహత్యాయత్నం

Published Wed, Jul 29 2015 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

The offender to commit suicide

హత్యకేసులో దొరుతాననే భయమే కారణం
అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించిన పోలీసులు


పాలకొండ: ఓ మహిళ హత్యకేసులో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న అనుమానితుడు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణం నవోదయనగర్‌లో ఆమిటి ప్రమీల అనే మహిళ ఈ నెల 10న హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ హత్య జరిగిన నాటి నుంచి సమీప బంధువు గొడవ ఈశ్వర్రావు తప్పించుకు తిరుగుతున్నాడు. ఈశ్వర్ రావు వృత్తి రీత్యా వంట పని చేస్తాడు. విజయనగరం జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు.

ఈ మధ్య ఈశ్వర్ పోలీసులకు ఫోన్ చేసి 'ఈ హత్య నేనే చేశా.. దమ్ముంటే నన్ను పట్టుకోండి' అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఈశ్వర్‌రావుతో పాటు అతడి బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం రోజున ఈశ్వర్ సమీప బంధువుల ఇంటికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. దొరుకుతాననే భయంతో ఈశ్వర్‌రావు చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈశ్వర్‌రావుని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement