
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసును పోలీసుల చేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఝాన్సీ ఇంటిని తనిఖీ చేసిన పంజాగుట్టు పోలీసులు కుటంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అనంతరం కుటుబంసభ్యులతో సహా పలువురిని విచారించారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ సంభాషణలపై దృష్టి సారించిన పోలీసులు.. అమె ప్రియుడు సూర్య ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝన్సీ సెల్‌ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసుల ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే కారణమని తేల్చారు. దీంతో సూర్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
చదవండి:
మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు..
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment