tv actress suicide
-
విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్
ఇటివల కాలంలో బలవ్మరణానికి పాల్పడుతున్న సినీ నటీనటులు సంఖ్య పెరిగిపోతుంది. కొంతమంది ఆఫర్లు రాక, మరికొందరు డిప్రెషన్‌తో ఇలా చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యువ నటి చేరింది. సౌత్ కొరియాకు చెందిన నటి యో జూ యూన్ ఆగస్ట్ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్ నోట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ ఆమె రాసిన ఈ సూసైడ్ నోట్ అటూ సౌత్ కొరియా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సినీ పరిశ్రమలో సైతం చర్చనీయాంశమైంది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఇంతకి తన సూసైడ్ నోట్ యో జూ యూన్ ఏం రాసిందంటే.. ‘మీ అందరి కంటే ముందుగా నేను వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమిచండి. ముఖ్యంగా అమ్మా-నాన్న, నానమ్మ, అన్నయ్యకు నా క్షమాపణలు. బతకాలని లేదంటూ నా హృదయం తరచూ ఆవేదన చెందింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అనుకుంటుంది ఇదే కదా. నేను లేని మీ జీవితాలు వెలితిగా ఉంటాయని తెలుసు. అయినా ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించండి. నేను పైనుంచి మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. దయచేసి ఏడవకండి. ‘ఇప్పటి వరకు అర్హతకు మించి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపాను. అందుకే నాకు ఈ జీవితం ఇక చాలు అనిపించింది. కాబట్టి నా విషయంతో ఎవరిని నిందించకండి. మీరు హ్యాపీగా ఉండండి. నేను చనిపోలేదు. మీతోనే ఉన్న. ప్లీజ్ మీరంత సంతోషంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. అలాగే ‘నాకు నటించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఒకవేళ అది నాలో ఒక భాగమేమో. కానీ ఆ జీవితం అంత సులభం కాదు. నాకు ఇంకేమీ చేయాలని లేదు. అదే నాకు నిరాశ. మనం నచ్చింది చేయాలనుకోవడం వరం. కానీ అది మాత్రమే చేయాలనుకోవడం శాపం. దేవుడికి నేనంటే ప్రేమ. ఆయన నన్ను నరకానికి పంపడు. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నా బాధ, నా ఫీలింగ్స్‌ని ఆయన అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకే ఎవరూ దిగులు చెందకండి. నన్ను ప్రేమించిన నా కుటుంబానికి, స్నేహితులకు థాంక్యూ. మీ ప్రేమే అదే నా బలం, ఆనందం. నేను చివరివరకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో జీవించాను. అదే నా సక్సెస్ అనుకుంటాను. నేను దీనిని మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది కదా. నేను కలుపుకున్న బంధాలకు, ముఖ్యంగా నా గురువులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక సెలవు’ అంటూ యో జూ యూన్ తన సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. చదవండి: నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ...
-
ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్య తేజకు రిమాండ్
హైదరాబాద్: టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది. సూర్య మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చే స్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని విచారణలో తెలిసింది. ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు సూర్య ఇంట్లో వేరే సంబంధాలు చూడటంతో నాగ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఝాన్సీ ఫోన్ చేస్తే అతను స్పందించనట్లు తెలిసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... గత ఏప్రిల్‌లో ఇద్దరికీ పరిచయం కాగా, జూన్‌లో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలో వివాహం చేసుకుంటామని జూలైలో ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్లి ఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందన్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌లో ఝాన్సీ కొంత డబ్బు అతనికి ఇచ్చిందని, దాంతో బైక్ కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉండగా అనంతరం ఇద్దరి మధ్యా చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. ఝాన్సీ నటించడం, వేరేవారితో మాట్లాడటం సూర్యకు నచ్చేది కాదని, దీంతో ఆమె నటన కూడా మానేసిందని తెలిపారు. ఈ క్రమంలో జనవరి నుంచి సూర్యకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని తెలియడంతో ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సూర్యతో మాట్లాడలేదని, కాని ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేయగా అతను స్పందించలేదన్నారు. మెసేజ్‌లు పెట్టినా అప్పుడు సూర్య ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఉండటంతో అతను అవి చూసుకోలేదని, తర్వాత నెట్ ఆన్ చేసినా ఝాన్సీ ఆ మెసేజ్‌లను డెలీట్ చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత సూర్య పలు మెసేజ్‌లు పెట్టినా ఆమె నుంచి స్పందన రాలేదని వివరించారు. -
పోలీసులు అదుపులో సూర్య
-
పోలీసుల అదుపులో సూర్య..
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. కాగా అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. (ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం) పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఝాన్సీ తల్లీ, సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్న పోలీసులు నాని అలియాస్ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
‘వేధింపులవల్ల షూటింగ్ కూడా మానేసింది’
హైదరాబాద్: తన కూతురు ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని టీవీ నటి ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..తన కూతురు వివాహానికని రూ.10లక్షల బంగారం చేయించి ఆమెకు ఇచ్చానని, ఝాన్సీని నమ్మించి ఆ బంగారాన్ని సూర్యతేజ తీసుకున్నాడని తెలిపింది. అతడి పుట్టిన రోజున రూ.లక్షా 30 వేల విలువైన బైక్‌ను కానుకగా ఇచ్చిందని వారు వెల్లడించారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని సూర్యతేజ బంధువుల ఇంటికి కూడా ఝాన్సీని తీసుకు వెళ్లాడని..అప్పట్నుంచి నుంచి వేధిస్తున్నాడని సంపూర్ణ, దుర్గాప్రసాద్‌లు తెలిపారు. అతడి వేధింపులవల్లే షూటింగ్ కూడా వెళ్లడం మానేసిందన్నారు. ఇప్పుడు తప్పించుకునేందుకు వేరేవారితో సంబంధం అంటగడుతున్నాడని వాపోయారు. మానసికంగా కుంగి పోయి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వెంటనే సూర్యతేజను అరెస్టు చేసి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. -
తన కూతురు ఆత్మహత్యకు సూర్య తేజనే కారణం
-
ఝాన్సీ ఆత్మహత్యకు అతడే కారణం
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసును పోలీసుల చేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఝాన్సీ ఇంటిని తనిఖీ చేసిన పంజాగుట్టు పోలీసులు కుటంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అనంతరం కుటుబంసభ్యులతో సహా పలువురిని విచారించారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ సంభాషణలపై దృష్టి సారించిన పోలీసులు.. అమె ప్రియుడు సూర్య ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝన్సీ సెల్‌ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసుల ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే కారణమని తేల్చారు. దీంతో సూర్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం
-
ఝాన్సీ ఆత్మహత్యపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి సువ్వాడ నాగ ఝాన్సీ(21) ఆత్మహత్యపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఈ కేసులో అభయోగాలను ఎదుర్కొంటున్న సూర్యను పోలీసులు విచారించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నామని వివరించారు. చనిపోవడానికి ముందు 14 వాట్సప్ మెసెజ్‌లు చేసినట్లు సమాచారం. సెల్ఫీ వీడియోలో ఏముంది? ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. అయితే ఆ వీడియోలో ఏముందో పోలీసులు బయటకు చెప్పకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఝాన్సీ తన అపార్ట్మెంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య) -
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఒదిలి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, సంపూర్ణ దంపతులకు కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె నాగ ఝాన్సీ ఉన్నారు. వారు మూడేళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చారు. ఝాన్సీ ఓ తెలుగు టీవీ చానల్లో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్లో నటించేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఝాన్సీకి విజయవాడకు చెందిన సూర్యతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం ఝాన్సీ ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. అయితే రెండు నెలలుగా ఝాన్సీపై సూర్య అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతని వేధింపుల వల్లే ఝాన్సీ నటన ఆపేసి నెల క్రితం ఓ స్నేహితురాలితో కలసి అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోందని తెలిపారు. రోదిస్తున్న ఝాన్సీ తల్లి, కుటుంబ సభ్యులు వేధింపుల వల్లే ఆత్మహత్య... నాలుగు రోజులుగా ఝాన్సీ తీవ్ర డిప్రెషన్లో ఉందని ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాను ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ ఉందని, కిటికీలోంచి లోపలకు వెళ్లి బెడ్రూం తలుపు విరగ్గొట్టి చూడగా ఝాన్సీ ఉరేసుకొని వేలాడుతూ కనిపించిందన్నారు. పవిత్రబంధం అనే సీరియల్లో చేస్తున్నప్పుడు తన కుమార్తెకు ఓ అమ్మాయి ద్వారా సూర్య పరిచయమయ్యాడని ఆమె తల్లి సంపూర్ణ గాంధీ ఆసుపత్రిలో బుధవారం విలేకరులకు వివరించారు. గత 6 నెలలుగా తమకు సూర్య పరిచయమని, ఇరువురి పెళ్లికి కూడా తాము అంగీకరించా మన్నారు. గత కొన్ని రోజులుగా ఝాన్సీ ఫోన్లో ఎవరితోనో గొడవ పడుతుండేదని, మూడు రోజుల క్రితమే తన కుమార్తె నగరానికి వచ్చిందన్నారు. ఇంటి నిర్మాణం పనుల కోసం స్వగ్రామంలో ఉన్న తాను సోమవారం ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ బిజీ అని వచ్చిందన్నారు. సూర్యతో ఝాన్సీ (ఫైల్) ఆమె ప్రవర్తనలో మార్పు వల్లే దూరంగా ఉన్నా: సూర్య ఇటీవల ఝాన్సీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా మారకపోవడంతో తాను ఝాన్సీకి దూరంగా ఉన్నానని సూర్య ఓ చానల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఝాన్సీకి బాబీ, గిరి అనే సినీ బ్రోకర్లతో గతం నుంచే పరిచయం ఉందని, గిరి ఓసారి ఝాన్సీని వేధిస్తే అతన్ని హెచ్చరించానని పేర్కొన్నాడు. ఝాన్సీకి సీరియల్లో చాన్సులు లేవన్నాడు. ఝాన్సీ తనకు చివరిసారి వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి వాటిని డిలిట్ చేసిందన్నాడు. రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం: పంజగుట్ట ఏసీపీ నాగ ఝాన్సీ మృతిపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఈ కేసులో ఆధారాలుగా ఝాన్సీకి చెందిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిని విశ్లేషణకు పంపామని, ఆ వివరాలతో ఝాన్సీ మరణానికి సంబంధించిన అంశాలు తెలియొచ్చన్నారు. -
భయపడ్డాను.. అందుకే చెప్పలేదు!
టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి వ్యవహారంలో అనేక కథనాలు తెరపైకి వస్తున్నాయి. అనుమనాస్పద పరిస్థితుల నడుమ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో ఉన్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని కథనాలు వస్తున్నాయి. ప్రతిక్షణం ఓ కొత్త కథనం తెరపైకి వస్తున్న ఈ మిస్టరీ డెత్ కేసులో పోలీసులు ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఒక రహస్య ప్రదేశంలోని అతడిని ముంబై పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ మృతికేసులో అతని ప్రమేయముందనే వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులకు అతడు తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తాను ఇంటినుంచి వెళ్లేటప్పుడు ప్రత్యూష బాగానే ఉందని, కానీ సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించిందని అతడు పోలీసులకు తెలిపాడు. 'డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మేం ఉండేవాళ్లం. మా వద్ద రెండు తాళం చెవిలు ఉండేవి. అందులో ఒకటి నా దగ్గర మరొకటి ప్రత్యూష దగ్గర ఉండేది. సాయంత్రం నేను ఇంట్లోకి రాగానే తను ఉరేసుకొని కనిపించింది. నేను భయపడ్డాను. ఇరుగుపొరుగువారిని పిలిచి.. వారి సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించాను. తను బతికే ఉందని మేం అనుకున్నాం, కానీ చనిపోయింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చేందుకు నేను భయపడ్డాను. ఆస్పత్రి అధికారులే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వైద్యులు ప్రత్యూష చనిపోయినట్టు నిర్ధారించిన తర్వాత ఆమె కుటుంబసభ్యులకు, సన్నిహిత మిత్రులకు ఫోన్ చేసి చెప్పాను' అని రాహుల్ సింగ్ పోలీసులకు వాంగ్మూలమిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, అతనికి విరుద్ధంగా ఇంకా కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు అతన్ని అధికారికంగా కస్టడీలోకి తీసుకోలేదు.