
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి సువ్వాడ నాగ ఝాన్సీ(21) ఆత్మహత్యపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఈ కేసులో అభయోగాలను ఎదుర్కొంటున్న సూర్యను పోలీసులు విచారించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నామని వివరించారు. చనిపోవడానికి ముందు 14 వాట్సప్ మెసెజ్‌లు చేసినట్లు సమాచారం.
సెల్ఫీ వీడియోలో ఏముంది?
ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. అయితే ఆ వీడియోలో ఏముందో పోలీసులు బయటకు చెప్పకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఝాన్సీ తన అపార్ట్‌మెంట్‌లోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment