
సాక్షి, మణికొండ(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.నాగేశ్వర్‌రావు, దేవి(35) దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఫిలింనగర్ ఎంఆర్‌సీ కాలనీలో నివాసముంటున్నారు.
దేవి పుప్పాలగూడ, అల్కాపురి టౌన్‌షిప్, ఫైర్‌పీల్డ్ కాలనీల్లో వంట పని చేస్తుంటుంది. ఈ నెల 13వ తేదీ ఉదయం ఆమె ఫైర్‌పీల్డ్ కాలనీలో పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment