Married Woman Missing Mystery In Hyderabad - Sakshi
Sakshi News home page

బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ అదృశ్యం

Nov 12 2021 9:16 AM | Updated on Nov 12 2021 10:47 AM

Married Woman Missing Mystery In Hyderabad - Sakshi

సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్‌): బ్యూటీపార్లర్‌కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. దోమలగూడ గగన్‌మహల్‌లో నివసించే జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) భార్యాభర్తలు. భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.

సాయంత్రం 6.30కు భార్గవి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో దుర్గాప్రసాద్‌ బ్యూటీపార్లర్‌కు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అక్కడ లేకపోవడంతో బంధువులు, స్నేహితులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో దుర్గాప్రసాద్‌ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement