సాక్షి, హైదరాబాద్: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది.
జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..
బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment