
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తల్లితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని బ్రహ్మశంకర్ నగర్‌లో నివసించే భాగ్యశ్రీ (24) నాలుగున్నరేళ్ల నందిక, రెండున్నరేళ్ల ఎస్. మల్లికార్జున్ ఈ నెల 6వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతకుముందు భర్త మహేశ్‌తో గొడవ పడింది.
ఈ నెల 4, 5 తేదీల్లో ఆమె బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కొంత కాలంగా ఫోన్‌లో ఇష్టానుసారంగా, టూమచ్‌గా మాట్లాడుతున్నట్లు ఆరోపించడంతో గొడవ ఎక్కువైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను తీసకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..)
Comments
Please login to add a commentAdd a comment