Hyderabad: The Women Hair Falls After Applying Oil In Abids Beauty Parlour - Sakshi
Sakshi News home page

అబిడ్స్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వాకం.. ఆయిల్‌ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు

Published Thu, Aug 3 2023 8:35 AM | Last Updated on Thu, Aug 3 2023 11:23 AM

After Applying Oil The Women Hair Fall Hyderabad Abids Beauty Parlour - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హెయిర్ కట్‌ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాక్‌ తగిలింది. బ్యూటీషియన్‌ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్‌లో జరిగింది. మహిళకు హెయిర్‌ కట్‌ చేసి ఆయిల్‌ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్‌పై కేసు నమోదు చేశారు.

బ్యూటీ పార్లర్‌ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్‌ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్‌ వ్యాక్స్‌ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్‌ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్‌ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement