
హైదరాబాద్: తన కూతురు ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని టీవీ నటి ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..తన కూతురు వివాహానికని రూ.10లక్షల బంగారం చేయించి ఆమెకు ఇచ్చానని, ఝాన్సీని నమ్మించి ఆ బంగారాన్ని సూర్యతేజ తీసుకున్నాడని తెలిపింది.
అతడి పుట్టిన రోజున రూ.లక్షా 30 వేల విలువైన బైక్‌ను కానుకగా ఇచ్చిందని వారు వెల్లడించారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని సూర్యతేజ బంధువుల ఇంటికి కూడా ఝాన్సీని తీసుకు వెళ్లాడని..అప్పట్నుంచి నుంచి వేధిస్తున్నాడని సంపూర్ణ, దుర్గాప్రసాద్‌లు తెలిపారు. అతడి వేధింపులవల్లే షూటింగ్ కూడా వెళ్లడం మానేసిందన్నారు. ఇప్పుడు తప్పించుకునేందుకు వేరేవారితో సంబంధం అంటగడుతున్నాడని వాపోయారు. మానసికంగా కుంగి పోయి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వెంటనే సూర్యతేజను అరెస్టు చేసి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment