మాల్యా నేరస్తుడేనన్నముంబై కోర్టు
ముంబైః బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయమాల్యా కేసును ప్రత్యేక ముంబైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.
విజయమాల్యాపై మనీ లాండరింగ్ చట్టంకింద ఈడీ ఈ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కోట్లకొద్దీ బ్యాంకులనుంచి రుణం తీసుకొని మార్చి 2 వ తేదీన మాల్యా భారత దేశంనుంచీ దొంగతనంగా పారిపోయి, లండన్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి తిరిగి రావాలని పదే పదే సెంట్రల్ ఏజెన్సీనుంచి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విస్మరించి అవమానిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికీ మాజీ రాజ్యసభ సభ్యుడు మాల్యా పాస్పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం, అతడిని ఇండియాకు పంపించాలని బ్రిటన్ ను అభ్యర్థించింది. అయితే ఆ డిమాండ్ ను లండన్ తిరస్కరించింది.