మాల్యాకి మరోషాక్
ముంబై: వేలకోట్ల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు ముంబై స్పెషల్ కోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇటీవల మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ప్రకటించిన కోర్టు మనీ లాండరింగ్ కేసులో జులై 29న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. మాల్యాకు వ్యతిరేకంగా దాఖలైన నగదు బదిలీ కేసులకు సంబంధించిన విచారణలో కోర్టు ఈ ఆర్డర్ జారీ చేసింది. జులై 29 ఉదయం 11 గంటల లోపు హాజరు కావాలని స్పెషల్ జడ్జ్ పీఆర్ భావకే బుధవారం స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
కాగా గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.