proclaimed
-
Jan 22: రామ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు
టొరంటో: జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్ఫోర్డ్ మునిసిపాలిటీలు 22ను రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. మూడు మునిసిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామ మందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు హిందూ కెనడియన్ ఫౌండేషన్(హెచ్సీఎఫ్) అధ్యక్షుడు అరుణేష్ గిరి తెలిపారు. గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ)లోనూ రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించి హోర్డింగులు పెట్టినట్లు ఇవి పండుగ వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని గిరి చెప్పారు. కెనడా వ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
మాల్యా నేరస్తుడేనన్నముంబై కోర్టు
ముంబైః బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయమాల్యా కేసును ప్రత్యేక ముంబైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. విజయమాల్యాపై మనీ లాండరింగ్ చట్టంకింద ఈడీ ఈ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కోట్లకొద్దీ బ్యాంకులనుంచి రుణం తీసుకొని మార్చి 2 వ తేదీన మాల్యా భారత దేశంనుంచీ దొంగతనంగా పారిపోయి, లండన్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి తిరిగి రావాలని పదే పదే సెంట్రల్ ఏజెన్సీనుంచి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విస్మరించి అవమానిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికీ మాజీ రాజ్యసభ సభ్యుడు మాల్యా పాస్పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం, అతడిని ఇండియాకు పంపించాలని బ్రిటన్ ను అభ్యర్థించింది. అయితే ఆ డిమాండ్ ను లండన్ తిరస్కరించింది.