టొరంటో: జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్‌ఫోర్డ్ మునిసిపాలిటీలు 22ను రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. మూడు మునిసిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామ మందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు హిందూ కెనడియన్ ఫౌండేషన్(హెచ్‌సీఎఫ్) అధ్యక్షుడు అరుణేష్ గిరి తెలిపారు.
గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ)లోనూ రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించి హోర్డింగులు పెట్టినట్లు ఇవి పండుగ వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని గిరి చెప్పారు. కెనడా వ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.
ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
Comments
Please login to add a commentAdd a comment