Mumbai Special Court
-
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(PMLA)యాక్ట్ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో మనీల్యాండరింగ్ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్ మంత్రి చగ్గన్ భుజ్‌బల్.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. -
రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడుతాడేమో
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధమేచల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను పరిశీలిస్తే డ్రగ్స్ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్ జడ్జి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు. ‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్ల వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఆర్యన్‌కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్ ఒప్పుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే గడుపుతున్నారు. -
పీఎన్బీకి చోక్సి కంపెనీలు 6 వేల కోట్ల టోకరా
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాభరణాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన సంస్థలు.. నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ల (ఎఫ్ఎల్సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 6,345 కోట్ల మేర మోసగించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ముంబైలోని ప్రత్యేక కోర్టుకి సీబీఐ గత వారం ఈ మేరకు సప్లిమెంటరీ చార్జిషీటును సమర్పించింది. చోక్సి, ఆయన కంపెనీల సిబ్బందితో పీఎన్బీ ఉద్యోగులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరతీశారని ఇందులో పేర్కొంది. 2017 మార్చి–ఏప్రిల్‌లో ఎలాంటి మార్జిన్లు లేకుండా, బ్యాంకు సిస్టమ్‌లో ఎంట్రీలు చేయకుండా ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లోని పీఎన్బీ ఉద్యోగులు.. చోక్సి కంపెనీలకు 165 ఎల్వోయూలు, 58 ఎఫ్ఎల్సీలు జారీ చేశారని తెలిపింది. వీటి ద్వారా విదేశీ బ్యాంకుల నుంచి చోక్సి సంస్థలు భారీగా రుణాలు తీసుకున్నాయి. కానీ వాటిని తిరిగి కట్టకపోవడంతో వడ్డీతో కలిపి రూ. 6,345 కోట్లను విదేశీ బ్యాంకులకు పీఎన్బీ చెల్లించిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. -
క్రిమినల్ లావాదేవీలుగా చూపారు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాను భారత్‌కు తిరిగిరాలేనని నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తెలిపారు. భారత్‌లో తన ప్రాణాలకు భద్రత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది న్యాయస్థానంలో ఈ మేరకు స్పందించారు. ఈ వ్యవహారంలో తానే దోషి అన్నట్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారని నీరవ్ పిటిషన్లో తెలిపారు. తాను చేసిన సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా పీఎన్బీ అధికారులు క్రిమినల్ లావాదేవీలుగా కలరింగ్ ఇచ్చారని ఆరోపించారు. -
జే డే హత్య కేసులో చోటా రాజన్‌కు జీవిత ఖైదు
-
చోటా రాజన్‌కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై: జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే (జే డే) హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ సహా మొత్తం 9 మంది దోషులకు ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 2011 నాటి ఈ కేసులో దోషులందరూ ఒక్కొక్కరు రూ.26 లక్షల జరిమానా చెల్లించాలని మోకా (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం–ఎంసీవోసీఏ) కోర్టు ఆదేశించింది. జే డేను హత్య చేసేలా చోటారాజన్‌ను మాజీ జర్నలిస్టు జిగ్నా వోరా ప్రేరేపించారనీ, అలాగే ఈ హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాల్సన్ జోసెఫ్ నిర్వహించారంటూ నమోదైన అభియోగాలను న్యాయమూర్తి సమీర్ అడ్కర్ కొట్టివేస్తూ వారిరువురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. 2015లో చోటా రాజన్ ఇండోనేసియాలోని బాలి విమానాశ్రయంలో అరెస్టయ్యి, భారత్‌కు వచ్చాక అతను దోషిగా తేలిన ప్రధాన కేసు ఇదే. బుధవారం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణను చోటా రాజన్ వీక్షించాడు. అసలు కేసేంటి? జే డే (చనిపోయినప్పటికి ఆయన వయసు 56 ఏళ్లు) ముంబైలో మిడ్ డే అనే పత్రికకు సీనియర్ ఎడిటర్‌గా పనిచేసేవారు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, మాఫియాలో అతని బలం తగ్గిందంటూ వార్తలు రాయడంతో జే డేపై చోటా రాజన్ కోపం పెంచుకుని హత్య చేయించాడు. 2011 జూన్ 11న జే డే తన ఇంటికి వెళ్తుండగా ముంబైలోని పొవాయ్ ప్రాంతానికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో జే డే మరణించారు. ఈ కేసుకు సంబంధించి అదే ఏడాది జూన్ 27న ఏడుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి మోకా కింద అభియోగాలు మోపారు. 2016 జనవరిలో ఈ కేసు సీబీఐకి చేరింది. -
‘మాలెగావ్’ మచ్చ
మహారాష్ట్రలోని మాలెగావ్‌లో పదేళ్లక్రితం సంభవించిన పేలుళ్ల ఉదంతంలో అరెస్టయిన నిందితులంతా నిర్దోషులని ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం తేల్చి చెప్పింది. 37మంది మరణానికి, 125మంది గాయాలపాలు కావడానికి దారి తీసిన ఆ ఉదంతం మాలెగావ్ మసీదుకు సమీపంలో ఉన్న ముస్లిం శ్మశానం వద్ద ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో 2006 సెప్టెంబర్‌లో చోటచేసుకుంది. దేశంలో ఉగ్రవాదుల బాంబులు పేలి జన నష్టమూ, ఆస్తినష్టమూ సంభవించి నప్పుడు సమాజంలో భయాందోళనలతోపాటే ఆగ్రహావేశాలు రగులుతాయి. కారకులైనవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వస్తుంది. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ ఉదంతాలూ, అవి సృష్టించిన ఆగ్రహావేశాల తీవ్రత చల్లారు తుంది. నిందితులంతా నిర్దోషులని తేలినప్పుడు రెండు రకాల ప్రమాదాలుం టాయి. ఒకపక్క ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడినవారు స్వేచ్ఛగా సంచరిస్తూ మళ్లీ మళ్లీ ఇలాంటి పాపాలకు పథక రచన చేస్తుంటారు. నేరగాళ్లని ముద్రేయించు కున్నవారూ, వారి కుటుంబసభ్యులూ అన్నివిధాలా నష్టపోతారు. వారు నిర్దోషులే నని న్యాయస్థానాలు చెప్పినా కోల్పోయినవి తిరిగి రావు. పైగా అలాంటివారిని జీవితాంతమూ అనుమాన దృక్కులు వెంటాడుతూనే ఉంటాయి. మాలెగావ్ పేలుళ్ల కేసు చరిత్ర, అది తీసుకున్న మలుపులు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తొలుత దర్యాప్తు చేసిన మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) 9మంది ముస్లిం యువకులు ఈ పేలుళ్లకు కారణమని నిర్ధారించుకుని 2006 డిసెంబర్లో చార్జిషీటు దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేశాక ఆ సంస్థ సైతం అదే నిర్ధారణకొచ్చింది. అనంతరకాలంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేరే కోణాన్ని ఆవిష్కరించింది. ఈ పేలుళ్లకు అసలు కారకులు హిందూ అతివాద సంస్థకు చెందిన 8మంది అని తేల్చి వారిలో నలుగుర్ని 2011లో అరెస్టుచేసింది. మరో నలుగురు ఈనాటికీ చట్టానికి చిక్కలేదు. ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత ఈ కేసులో జైళ్లలో ఉన్న ముస్లిం యువ కులకు బెయిల్ లభించింది. వీరందరినీ కేసు నుంచి విముక్తం చేయొచ్చునని 2013లో కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. తమను నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ నిందితులు సైతం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై తీర్పు రాబోతున్న తరుణంలో ఈ నెల మొదట్లో ఎన్ఐఏ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఈ కేసులో ‘మరింత దర్యాప్తు’ అవసరమని న్యాయస్థానానికి తెలి పింది. అయినా ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం నిందితులు నిర్దోషులనే భావిం చింది. కేంద్రంలో ప్రభుత్వం మారబట్టే ఎన్ఐఏ తన వాదనను సవరించు కోవడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలను ఆ సంస్థ డీజీ శరత్‌కుమార్ తోసిపుచ్చుతున్నారు. తాము ‘మరింత దర్యాప్తు’ అవసరమన్నామే తప్ప...‘తిరిగి దర్యాప్తు చేయాల’ని చెప్పలేదంటున్నారు. మంచిదే. ఏం చెప్పినా అనవసరమైన అనుమానాలకైతే ఆస్కారమీయకూడదని గ్రహించి ఉంటే బాగుండేది. పేలుళ్ల కేసులో తొలుత నిందితులుగా భావించినవారొకరైతే అనంతర కాలంలో వేరొకరు దోషులుగా తేలడం ఈ కేసులో మాత్రమే కాదు...వేరే కేసుల్లోనూ జరిగాయి. మాలెగావ్లోనే 2008లో రెండోసారి జరిగిన పేలుళ్ల ఉదంతంలోనూ, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులోనూ ఈ మాదిరే జరిగింది. ఏ తప్పూ చేయనివారు అయిదేళ్లపాటు జైళ్లలో మగ్గడం విషాదకరమని అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అన్నప్పటికీ అలాంటి తరహా కేసులు ఏమీ తగ్గలేదు. దర్యాప్తు క్రమమంతా లొసుగులతో నడిచి అమాయకులు జైలుపాలు కావడం, నేరస్తులు బయట పెద్ద మనుషులుగా చలామణి కావడం అన్నది కొనసాగుతూనే ఉంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు న్నాయన్న ఆరోపణతో అరెస్టయిన ఒక యువకుడు 20 ఏళ్లపాటు జైల్లో గడిపి 2013లో నిర్దోషిగా బయటపడ్డాడు. మాలెగావ్ కేసులో తొలుత దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు నిందితులపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదు గనుక జరిగిన తప్పిదానికి వారిని బాధ్యుల్ని చేయలేమని ముంబై ప్రత్యేక కోర్టు అభిప్రాయ పడింది. ఆ అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోయి ఉండొచ్చు నన్నది. అయితే క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలినపక్షంలో దర్యాప్తు అధికారులను అందుకు బాధ్యులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతిని ఇక్కడ ప్రస్తావించు కోవాలి. ఉద్దేశపూర్వకంగా దర్యాప్తును భ్రష్టుపట్టించినా, నిర్లక్ష్యంగా వ్యవహ రించినా బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా న్యాయ మూర్తులు సూచించారు. దర్యాప్తు అధికారులు తెలిసి చేసినా...చేతగాకనో, అనాలోచితంగానో చేసినా ఒక నిండు జీవితంలో చీకట్లు ముసురుకుంటాయి. అంతేకాదు...అసలు నేరస్తులు తమ పని తాము చేసుకుపోతూ సమాజానికి పెద్ద బెడదగా మారతారు. అయితే దర్యాప్తు అధికారుల్లో నిపుణత కొరవడటం అన్నది దానికదే పుట్టుకు రాదు. సకల వ్యవస్థలనూ భ్రష్టుపట్టించే రాజకీయ నాయకత్వమే ఇలాంటి పరిస్థితులకు దోహదపడుతుంది. పోలీసు వ్యవస్థ తమ చెప్పుచేతల్లో ఉంటే చాలు...మిగిలినవి పట్టించుకోవద్దనుకునే పాలకులున్నప్పుడు చివరకు నడిచేది ఇష్టారాజ్యమే. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు 75 లక్షల కేసులు క్రిమినల్ కేసులే. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఇతరత్రా తీసుకునే చర్యల మాటెలా ఉన్నా... ఆషామాషీగా, అలవోకగా కేసులు పెట్టే తీరును సరిచేస్తే తప్ప ఈ కేసుల భారం తగ్గదు. ఎందుకంటే పోలీసులు పెట్టే కేసుల్లో దాదాపు 60 శాతం అనవసరమైనవేనని చాన్నాళ్లక్రితం జాతీయ పోలీసు కమిషన్ నివేదిక తెలిపింది. పోలీసుల విధి నిర్వహణలో రాజకీయ జోక్యం తగ్గడం తోపాటు...వారికి జవాబుదారీతనం అలవాటు చేయాలి. పోలీసుల తప్పిదం కారణంగా ఎవరైనా నిష్కారణంగా జైలుపాలయ్యారని తేలినప్పుడు తగిన నష్టపరిహారాన్ని అందించాలి. బాధ్యులైన అధికారులపై చర్యలుండాలి. ఇవన్నీ అమల్లోకి రానప్పుడు మాలెగావ్ కేసులో జరిగిన తప్పిదాలవంటివి పున రావృతమవుతూనే ఉంటాయి. అమాయకులు ఇబ్బందులకు లోనవుతూనే ఉంటారు. -
‘మాలెగావ్’ నిందితులు నిర్దోషులు
ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు ముంబై: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైన 8మంది ముస్లిం యువకులకు వ్యతిరేకంగా ఆధారాల్లేవంటూ ముంబై ప్రత్యేక కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిని వె ంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 2006 సెప్టెంబర్ 8న మాలెగావ్‌లోని మసీదు దగ్గరున్న ముస్లిం శ్మశానం వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా 100కు పైగా గాయాల పాలయ్యారు. రయిస్ అహ్మద్, ఫరోగ్ మగ్దుమి, ఆసీఫ్ ఖాన్, అబ్రర్ అహ్మద్, నురుల్ హుడా, శబ్బీర్ అహ్మద్, సల్మాన్ ఫార్సీ, శేఖ్ మహ్మద్ అలీ, మహ్మద్ జాహిద్‌లు మొత్తం 9 మందిని ఉగ్రవాద వ్యతిరేక విభాగం(ఏటీఎస్) అరెస్టు చేసి చార్జిషీట్ న మోదు చేసింది. వీరిలో ఒకరు కేసు దర్యాప్తులో ఉండగా మృతి చెందాడు. 2011లో వీరందరికి బెయిల్ మంజూరైంది. వారు నేరం చేశారని చెప్పినా సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించ లేకపోయింది. ఆ 8 మంది నేరం చేశారని నిరూపించేలా సీబీఐ, ఏటీఎస్‌లు ఆధారాలు సంపాదించలేకపోయాయని, తాము జరిపిన విచారణలో లభించిన ఆధారాలకు సీబీఐ, ఏటీఎస్‌లు ఇచ్చిన ఆధారాలకు చాలా వ్యత్యాసముందని పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. -
క్షమిస్తే సాక్ష్యం చెబుతా: హెడ్లీ
-
క్షమిస్తే సాక్ష్యం చెబుతా: హెడ్లీ
ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అమెరికా జైలులో ఉన్న అతడిని గురువారం సాయంత్రం 6.35 గంటలకు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తనపై మోపిన 11 అభియోగాలను అతడు అంగీకరించాడు. 26/11 దాడిలో తన పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తే సాక్ష్యం చెబుతానని కోర్టుకు తెలిపాడు. 'నేను కోర్టు ముందు హాజరయ్యాను. ముంబై కోర్టు నాకు క్షమాభిక్ష పెడితే 26/11 దాడి కేసుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను' అని హెడ్లీ పేర్కొన్నాడు. ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.