క్షమిస్తే సాక్ష్యం చెబుతా: హెడ్లీ
ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అమెరికా జైలులో ఉన్న అతడిని గురువారం సాయంత్రం 6.35 గంటలకు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తనపై మోపిన 11 అభియోగాలను అతడు అంగీకరించాడు. 26/11 దాడిలో తన పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తే సాక్ష్యం చెబుతానని కోర్టుకు తెలిపాడు.
'నేను కోర్టు ముందు హాజరయ్యాను. ముంబై కోర్టు నాకు క్షమాభిక్ష పెడితే 26/11 దాడి కేసుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను' అని హెడ్లీ పేర్కొన్నాడు. ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.