
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు, ఫ్యూజిటివ్ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (49)కి చెక్ చెప్పేందుకు కేంద్ర చకా చకా పావులు కదుపుతోంది. గతవారం లండన్‌లో అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్న నీరవ్ మోదీని ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 29న కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికారులకు సహకరిచేందుకు సీబీఐ ఈడీ ప్రత్యేక బృందం లండన్ బయలు దేరి వెళ్లనుంది. జాయింట్ డైరెక్టర్‌స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం లండన్ వెళుతోంది.
మరోవైపు 13 వేల కోట్ల రూపాయల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం (మార్చి29) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెండవసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు నీరవ్ సిద్ధమవుతున్నారు అక్కడి కోర్టు వర్గాలు ధృవీకరించాయి. గత వారం మోదీని అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చగా.. అతని బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో మోదీని జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment