సాక్షి. న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ లండన్‌లోని వర్డ్స్‌వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్‌కు అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది.
వేలకోట్ల రూపాయల మేర బ్యాంకును మోసం చేసి లండన్‌కు పారిపోయిన మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 వాప్తి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ)
నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో మోడీ పీఎన్‌బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment