లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్‌ను యూకే కోర్టు నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సంబంధించిన కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుండడంతో అప్పటివరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పరారయ్యాడు. లండన్‌లో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన లండన్ కోర్టు మెజిస్ట్రేట్ అతడి రిమాండ్‌ను నవంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పం
Comments
Please login to add a commentAdd a comment