RBI Working On Blockchain-Based Trade Financing Project Prevent Loan Frauds - Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కొత్త టెక్నాలజీ, వేల కోట్ల బ్యాంక్‌ స్కాంలు జరగవట!

Published Sat, Jun 25 2022 6:51 PM | Last Updated on Sat, Jun 25 2022 9:22 PM

Rbi Working On Blockchain Technology Prevent Loan Frauds - Sakshi

దేశంలో ఆర్ధిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కేంద్రం తీసుకోని నిర్ణయం లేదు. అయినా సరే ఎక్కడో ఓ చోటా రుణాల పేరిట జరుగుతున్న స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఫిర్యాదుతో రూ.42,871 కోట్ల కుంభ కోణం బ్యాంకింగ్‌ రంగ వ్యవస్థని అతలా కుతులం చేసింది. చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. 

వ్యాపారాల నిర్వహణ పేరుతో బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్లపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేలకోట్ల రూపాయలు (ఆర్టీఐలో తేలింది రూ.15,423.39 కోట్లు) మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ (బంధువు)మెహుల్ చోక్సీల తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో పలు బ్యాంకుల్ని సైతం ఆర్బీఐ జత చేసింది. 

12 బ్యాంక్‌లు 
హెచ్‌డీఎఫ్‌సీ,ఐసీఐసీఐ ,స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు 12కు పైగా బ్యాంకులు సమిష్టిగా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కేంద్రికృతమై జాతీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌ (ట్రేడ్‌ ఫైనాన్సింగ్‌) నిర్వహిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్‌ల నిర్వహణలో సత్ఫలితాలు రాబడితే నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీల్లాంటి ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల్ని మోసం చేయాలన‍్న ఆలోచనే రాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు పలు వెలుగులోకి నివేదికలు చెబుతున్నాయి. 

బెంగళూరు కేంద్రంగా 
బెంగళూరు కేంద్రంగా ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌లో యూరప్‌ దేశమైన బెల్జియంకు చెందిన బ్లాక్‌ చైన్‌ డెవలప‍్మెంట్‌ ఫ్లాట్‌ ఫామ్‌ సెటిల్‌ మింట్‌, అమెరికాకు చెందిన క్రోడా టెక్నాలజీస్‌, ఐబీఎంలు టెక్నాలజీ సపోర్ట్‌ను అందిస్తుండగా..యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి.    

ఫ్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ అంటే?
ఫ్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ పేరుతో ఆర్బీఐ నేతృత్వంలో డెవలప్‌ చేస్తున్న ఈ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ..దాని పరిభాషలో చెప్పాలంటే.. ఉదాహారణకు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు బ్యాంకుల వద్ద రుణం తీసుకొని వాటిని అక్రమ మార్గంలో మళ్లించేందుకు జరిపే ట్రాన్సాక్షన్‌లపై ఈ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కన్నేస్తుంది. అనుమానం వచ్చిందా వెంటనే ఈ టెక్నాలజీ అనుసందానమైన సెంట్రల్‌ డేటాతో సంబంధం లేకుండా బ్లాక్‌ చేస్తుంది. ఇన్‌ పుట్‌ డివైజ్‌, ఔట్‌పుట్‌ డివైజ్‌, స్టోరేజ్‌ డివైజ్‌ ఇలా మూడు పద్దతుల్లో ట్రాన్సాక్షన్‌లను బ్లాక్‌ చేసి సంబంధిత బ్యాంకుల సంబంధించిన కంప్యూటర‍్లకు లేదా, సంబంధిత శాఖలకు అలెర్ట్‌ ఇస్తుంది. తద్వారా లోన్‌ ఫ్రాడ్‌లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ ఈ టెక్నాలజీ విధి విధానాల్ని పరిశీలిస్తుండగా.. ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ అయితే  బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని సరి చేయాలని చూస్తోంది.

నిపుణులు ఏం అంటున్నారంటే!
రుణాలు పొందే విషయంలో ఈ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఎటువంటి అడ్డకట్ట వేయలేదు. అయితే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ నిధులను పక్క దారి పట్టిస్తుంటే మాత్రం ఇట్టే పసిగడుతుంది. వాళ్ల కుతంత్రాలకు చెక్‌ పెడుతుంది. తద్వారా భారీ స్థాయిలో జరిగే మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సాయంతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌సీ) పేరుతో జరిగే మోసాల్ని సైతం అరికట్టవచ్చు. 

చదవండి👉బ్యాంకులంటే విజయ్‌ మాల్యా గుండెల‍్లో దడే! కావాలంటే మీరే చూడండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement