భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్ మాత్రం దర్జాగా బ్రిటన్ వీధుల్లో తిరుగుతూ.. రాజభోగాలు అనుభవిస్తున్నాడు.