telegraph
-
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్న యశస్వి
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కలలో కూడా ఊహించని గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ద టెలిగ్రాఫ్' ప్రకటించిన ఆల్‌టైమ్ బెస్ట్ టాప్ 10 ఇండియన్ టెస్ట్ బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజాలతో కూడిన ఈ జాబితాలో యశస్వి పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓటింగ్ పద్దతిన జరిగిన ఈ ఎంపికలో యశస్వికి 1895 ఓట్లు వచ్చాయి. టీమిండియా డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజారుద్దీన్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, గుండప్ప విశ్వనాథ్, యశస్వి జైస్వాల్ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో నయా వాల్ పుజారాకు చోటు దక్కకపోవడం విశేషం. రోహిత్ స్థానంలో పుజారాను ఎంపిక చేయాల్సి ఉండిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్‌ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
నీరవ్ లండన్‌లో తేలాడు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ(48) లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివాసముంటున్న మోదీ కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ‘ది డైలీ టెలీగ్రాఫ్’ పత్రిక శనివారం వెలుగులోకి తెచ్చింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిచేందుకు ఇక్కడి వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో వారెంట్ జారీ ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత అధికారులు చెప్పారు. త్వరలోనే మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలున్నాయని, దీంతో అప్పగింత ప్రక్రియలో ముందడుగు పడుతుందని భారత అధికారులు తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీని అప్పగించాలని కోరుతూ భారత్ దాఖలుచేసిన విజ్ఞప్తిని యూకే హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావీద్ ధ్రువీకరించారు. భారత్ గత ఆగస్టులోనే ఈ మేరకు దరఖాస్తు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మోసపూరితంగా రూ.13,500 కోట్ల రుణాలు పొందిన కుంభకోణంలో నీరవ్ మోదీతో పాటు అతని మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ మోసం వివరాలు బహిర్గతం కాకముందే 2018, జనవరిలో ఈ ఇద్దరు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. నీరవ్ మోదీని భారత్ తీసుకొచ్చి విచారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. నీరవ్ మోదీ లాంటి వాళ్ల కోసం మోదీ సర్కారు ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ అనే పథకాన్ని నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. నో కామెంట్..ప్లీజ్ మహారాష్ట్రలోని కిహిమ్ బీచ్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నీరవ్ మోదీ భారీ సౌధాన్ని అధికారులు కూల్చివేసిన మరుసటి రోజే ఆయన జాడ అధికారికంగా తెలియడం గమనార్హం. రోడ్డుపై మోదీకి తారసపడిన విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్రిటన్‌లో రాజకీయ శరణార్థి కోసం దరఖాస్తు చేసుకున్నారా? భారత్ చేస్తున్న ఆరోపణలపై స్పందనేంటి? లాంటి ప్రశ్నలకు ‘నో కామెంట్’ అని మాత్రమే ఆయన సమాధానమిచ్చాడు. మోదీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా, అతని అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా..లండన్‌లో తాను నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే కొత్తగా వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. నీరవ్ మోదీని అప్పగించాలని భారత హైకమిషన్ గతేడాది ఆగస్టులోనే విజ్ఞప్తి చేయగా, ఆ ప్రతిపాదన అప్పటి నుంచి యూకే హోం శాఖ పరిశీలనలో ఉంది. మోదీ లండన్‌లోనే ఉన్నట్లు తాజాగా ధ్రువీకరణ కావడంతో యూకే హోం శాఖ స్పందిస్తూ..నిందితులపై అప్పగింత వారెంట్ జారీ అయిన తరువాత నేరస్థుల అప్పగింత ప్రక్రియ ముందుకు సాగుతుందని పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా విషయంలోనూ ఇలాగే జరిగింది. నీరవ్ మోదీపై అప్పగింత వారెంట్ జారీ అయిన తరువాత స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విచారణ జరపనున్నారు. అరెస్ట్‌కు ‘శరణార్థి’ అడ్డంకి? గతేడాది జూలైలో మోదీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యూకేలో ఆయన శరణు కోరాడా? లేదా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఒకవేళ శరణార్థి హోదా కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లయితే, అది పరిష్కారమయ్యే వరకు ఆయన్ని అరెస్ట్ చేయడం కుదరదు. స్వదేశంలో విచారణ పక్షపాతంగా జరగడం లేదని, వేధింపులకు గురవుతున్నానని, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని నిరూపించగలిగితే సదరు వ్యక్తికి శరణార్థి హోదా ఇచ్చే అవకాశాలున్నాయని సీనియర్ వలసల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. గతేడాదే లండన్‌కు పారిపోయి వచ్చిన నీరవ్ మోదీ 2018 ఫిబ్రవరిలో భారత అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేశాక కూడా కనీసం నాలుగు సార్లు బ్రిటన్ నుంచి విదేశాలకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆయన బ్రిటన్‌లో పనిచేసుకోవడానికి, పెన్షన్‌కి, ఆన్లైన్ బ్యాంకింగ్‌కి అవకాశం కల్పిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ని కూడా పొందినట్లు ది డైలీ టెలీగ్రాఫ్ తెలిపింది. నీరవ్ అక్కడున్న సంగతి తెలుసు: భారత్ నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకున్న సంగతి తెలుసు కాబట్టే ఆయన్ని అప్పగించాలని బ్రిటన్ను విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆయన్ని భారత్ తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నీరవ్ మోదీని లండన్‌లో గుర్తించినంత మాత్రాన వెంటనే భారత్‌కు తీసుకురాలేమని, ఇందుకోసం అధికారిక ప్రక్రియ ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. నీరవ్‌ను అప్పగించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ వేర్వేరుగా విన్ననపాలు పంపినట్లు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ స్పందిస్తూ...బ్యాంకు మోసగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక సెటిల్మెంట్ యోజనా నడుపుతోందని తీవ్రంగా మండిపడింది. బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్లు కొల్లగొట్టి పారిపోయిన బడా పారిశ్రామికవేత్తల్లో ఒక్కరినైనా ఈ ఐదేళ్లలో తీసుకురాలేకపోయారని దుయ్యబట్టింది. రూ.9 లక్షల కోటు, బుర్ర మీసాలతో బొద్దుగా, బుర్ర మీసాలతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే ఆస్ట్రిచ్ హైడ్ కోటు ధరించిన నీరవ్ మోదీ లండన్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ‘ది డైలీ టెలిగ్రాఫ్’ విడుదల చేసింది. టాటెన్హామ్ కోర్టు రోడ్డులో బహుళ అంతస్తుల విలాసవంతమైన ఆకాశహార్మ్యంలోని ఒక ఫ్లోర్లో సగభాగాన్ని ఆయన అద్దెకు తీసుకున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ ఫ్లాట్ అద్దె నెలకి రూ.15.48 లక్షలు అని అంచనా. నీరవ్ మోదీ ఈ ఫ్లాట్‌కి వంద గజాల దూరంలోనే కొత్తగా వజ్రాలæ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిసింది. నీరవ్ మోదీ తన అపార్ట్మెంట్ నుంచి సెంటర్ పాయింట్లో ఉన్న ఈ వజ్రాల వ్యాపార సంస్థ వరకూ తన చిన్న కుక్కపిల్లను వెంటబెట్టుకొని ప్రతిరోజూ వెళుతున్నట్టు ఆ పత్రిక వెల్లడించింది. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని ఈ బహుళ అంతస్తుల భవంతిలోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు -
లండన్‌లో ప్రత్యక్షమైన నీరవ్ మోదీ
-
బ్రిటన్ వీధుల్లో దర్జాగా ఆర్థిక నేరగాడు
లండన్ : భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్ మాత్రం దర్జాగా బ్రిటన్ వీధుల్లో తిరుగుతూ.. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. లండన్‌లోని సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లో నీరవ్ ఉన్నట్లు టెలిగ్రాఫ్ ధృవీకరించింది. నీరవ్ లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. దీంతో నీరవ్ ఆచూకీ వెలుగులోకి వచ్చింది. తప్పు చేశానన్న భయం ఏమాత్రం లేదు ఏ మాత్రం భయం లేకుండా రద్దీగా ఉండే లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లో విహరిస్తున్న నీరవ్‌ను టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించాడు. అనంతరం అతడితో సంభాషించేందుకు ప్రయత్నించాడు. నీరవ్ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, రిపోర్టర్ వదలలేదు. భారత్‌లో చేసిన ఆర్థిక నేరం, లండన్‌లో ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారంటూ నీరవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే వీటన్నింటికి నో కామెంట్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు నీరవ్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ రిపోర్టర్ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఆర్థిక నేరగాడి ఆచూకి వెలుగు చూసింది. ఇక తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసాలు, గడ్డాలు పెంచాడు. అంతేకాకుండా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో నీరవ్ ధరించిన కోటు ధర సుమారు ఏడు లక్షలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం నీరవ్ మోదీ సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లో లగ్జరీ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నాడని.. ఆ అపార్ట్మెంట్ అద్దె నెలకు రూ.16 లక్షలని సమాచారం. లండన్‌లోనూ తిరిగి బిజినెస్ ప్రారంభించాడని.. వెస్ట్ ఎండ్‌లో భారీ ఎత్తున వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్‌కు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సుమారు రూ.13 వేల కోట్లకు పైగా అప్పు తీసుకున్న నీరవ్.. అనంతరం ఆ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. చదవండి: పీఎన్బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ డైనమైట్లతో నీరవ్ మోడీ బంగ్లా పేల్చివేత -
టెలిఫోన్ లేని ప్రపంచం ఊహిద్దామా?
మానవచరిత్రలో మార్చి 10, 1876 ఒక మైలురాయి. ఆరోజు అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను రూపొందించిన టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తొలి మాటలు కమ్ హియర్ వాట్సాన్, ఐ వాంట్ యూ!. యూరోపియిన్ కమిషన్ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శాతం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలిఫోన్ల రంగంపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ 2006 సంవత్సరానికి ప్రమోటింగ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీని లక్ష్యంగా ఎంచుకున్నది. గ్లోబల్ టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ సుమారు 220 దేశాల్లో నిరాటంకంగా పనిచేస్తోంది. ఇప్పుడు భూమి మీదే కాకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిగ్రాఫ్, టెలెక్స్ టెలిఫోన్, టెలివిజన్ మొదలైన ప్రత్యేక వ్యవస్థలు ప్రత్యేక కేబుల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు తీగెల ఆధారంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేది. నేడు వైర్లెస్, సెల్‌ఫోన్ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నేడు సెల్‌ఫోన్ లేని వ్యక్తి లేడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నవారితో క్షణాల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, ఛాటింగులు చేయడం, వీడియో కాల్ చేయడం, వీడియోలు పంపడం సులభతరంగా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్ని రకాల సెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కొండలు, గుట్టలపైన కూడా సెల్ఫోన్లు పనిచేస్తున్నాయి. సెల్ఫోన్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవసరం మేరకే ఫోన్లను వాడితే మంచిది. అనవసర కబుర్లను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకోవడమే మేలు. (నేడు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సందర్భంగా) -కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
'టెలిగ్రాఫ్ లో ప్రేమ సందేశాలు పంపేవాడిని'
ముంబై: టెలిగ్రాఫ్ ద్వారా తన భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర వెల్లడించారు. తన అనుభూతులను టెలిగ్రాఫ్ ద్వారా వ్యక్తపరిచేవాడినని చెప్పారు. గురువారం ఆయన వియాన్ మొబైల్ ఫోన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'మొబైల్ ఫోన్లను యువత ఎలా హేండిల్ చేస్తుందో తెలియదు. నేను హీరో వెలుగొందుతున్న సమయంలో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో సరదాగా గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది. ఇప్పట్లా ఫోన్లు లేకపోవడంతో టెలిగ్రాఫ్ లో నా భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపుతుండేవాడిని. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాను. అయితే శోభ చదవగలిగే వాటిని మాత్రమే అందులో ఉంచుతున్నా' అని జితేంద్ర చెప్పారు. 73 ఏళ్ల జితేంద్ర 1970-80 దశకంలో పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాల్లో హీరోగా నటించారు. పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ మొబైల్ ఫోన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని వియాన్ యజమాని శిల్పాశెట్టి తెలిపారు. 80 శాతం మంది రూ. 10 వేలలోపు ధర ఉన్న ఫోన్లను వాడుతున్నారని, తాము కూడా ఈ రేంజ్ లోనే ఫోన్లు అందిస్తామన్నారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తమ కుమారుడు 'వియాన్' పేరుతో దీన్ని ప్రారంభించారు. -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి.