
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కలలో కూడా ఊహించని గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ద టెలిగ్రాఫ్' ప్రకటించిన ఆల్‌టైమ్ బెస్ట్ టాప్ 10 ఇండియన్ టెస్ట్ బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజాలతో కూడిన ఈ జాబితాలో యశస్వి పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓటింగ్ పద్దతిన జరిగిన ఈ ఎంపికలో యశస్వికి 1895 ఓట్లు వచ్చాయి.
టీమిండియా డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజారుద్దీన్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, గుండప్ప విశ్వనాథ్, యశస్వి జైస్వాల్ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో నయా వాల్ పుజారాకు చోటు దక్కకపోవడం విశేషం. రోహిత్ స్థానంలో పుజారాను ఎంపిక చేయాల్సి ఉండిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment