ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువకు ‘మూడీస్ రేటింగ్’ బలాన్నిచ్చింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 31 పైసలు బలపడి 65.01 వద్ద ముగిసింది.
గడిచిన వారం రోజుల్లో రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఆరు వారాల తరువాత ఇదే తొలిసారి. గురువారం రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 65.32. శుక్రవారం ఒక దశలో రూపాయి 64.60 స్థాయిని సైతం చూసింది. ఈ వారం మొత్తంలో రూపాయి విలువ 15 పైసలు బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment