ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ షాకిచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు మూడీస్ శుక్రవారం ప్రకటించింది. తన బాండ్లపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ఈ టెలికాం ఆపరేటర్ డిఫాల్ట్ అయిందనే కారణంతో మూడీస్ క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసింది. ''రిలయన్స్ కమ్యూనికేషన్స్ కా కార్పొరేట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం నెగిటివ్ అవుట్‌లుక్‌లో ఉంది. అదేవిధంగా ఆర్‌కామ్ సీనియర్ సెక్యుర్డ్ నోట్స్ కా రేటింగ్‌ను విత్‌డ్రా చేస్తున్నాం'' అని మూడీస్ ప్రకటించింది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ భారీ నష్టాలను నమోదుచేసింది.
కొన్ని డెబెంచర్లపై ఈ సంస్థ వడ్డీలు చెల్లించలేకపోతుంది. నిర్దారించిన సమయానికి వడ్డీలను చెల్లించకలేకపోవడంతో రేటింగ్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. సరియైన సమయంలో వడ్డీలు చెల్లించకపోవడాన్ని మూడీస్ అర్థంలో డిఫాల్ట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. మార్చి ముగింపు వరకు ఆర్‌కామ్ నికర అప్పు రూ. 44,300 కోట్లు ఉంది. తన అన్న ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో పేరుతో టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించడంతో ఆర్‌కామ్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. జియో నుంచి వస్తున్న తీవ్రమైన ధరల యుద్ధాన్ని ఈ సంస్థ తట్టుకోలేకపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment