అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత్ వృద్ధి రేటును 2018 సంవత్సరానికి 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. 2018 సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను మార్పు చేయకుండా గతంలో వెల్లడించిన మేరకు 7.6 శాతం నమోదవుతుందని స్పష్టంచేసింది. 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రముఖ వర్ధమాన దేశాల్లో భారత్, ఇండోనేషియా దేశాల వృద్ధి అంచనాలను మాత్రమే మార్పు చేయడం లేదని పేర్కొంది.
అంతర్జాతీయంగానూ వృద్ధి మెరుగే
2018, 2019 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ధి అంచనాలను సైతం మూడీస్ పెంచింది. అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment