India growth rate
-
అగ్రోకెమికల్స్ ఆదాయంలో వృద్ధి
ముంబై: వ్యవసాయ రసాయనాల రంగం ఆదాయం భారత్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. స్థిరంగా దేశీయ డిమాండ్, ఎగుమతుల పరిమాణంలో పునరుద్ధరణ ఇందుకు కారణమని వివరించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్వల్పంగా 5–6 శాతం వృద్ధిని సాధిస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఇవి 100 బేసిస్ పాయింట్లు పెరిగి 12–13 శాతానికి చేరాయి. ఇప్పటికీ కోవిడ్ ముందస్తు స్థాయి 15–16 శాతం కంటే ఇది తక్కువ. ఇది సంస్థలను మూలధన వ్యయం విషయంలో జాగ్రత్తగా ఉంచుతుంది. నగదు ప్రవాహాలు, బ్యాలెన్స్ షీట్లను స్థిరంగా నిర్వహించడానికి వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఈ రంగం మొత్తం ఆదాయంలో సగభాగాన్ని కలిగి ఉన్న ఎగుమతుల నుండి వచ్చే ఆదాయంలో మార్పు కనిపిస్తోంది. తక్కువ–ధర కలిగిన చైనా ఉత్పత్తులకు సంబంధించిన అదనపు నిల్వల సమస్యలను గ్లోబల్ సంస్థలు పరిష్కరించాయి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్‌ని మెరుగ్గా నిర్వహించడానికి పంటల సీజన్‌కు దగ్గరగా ఆర్డర్ చేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. ధరల ఒత్తిడి ఉన్నా.. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన పరిమాణ వృద్ధిని ఆశిస్తున్నప్పటికీ, పోటీ ధర కలిగిన చైనీస్ ఉత్పత్తుల నుండి ధరల ఒత్తిళ్ల మధ్య రాబడి వృద్ధి 3–4 శాతం వద్ద స్వల్పంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఒత్తిళ్లు తగ్గినందున రాబడి 7 శాతానికి పైగా మెరుగుపడవచ్చు. మంచి రుతుపవనాలు, తగినంత రిజర్వాయర్ల స్థాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆదాయం 8–9 శాతం పెరిగింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతున్నాయి. చైనాలో అధిక సరఫరా నుండి ధరల ఒత్తిడి ఉన్నా.. గత సంవత్సరం కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. ఇన్వెంటరీ రైట్ ఆఫ్‌ల సంఘటనలు తగ్గుతాయి. ఈ రంగం యొక్క ఆపరేటింగ్ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి, వచ్చే ఏడాది 13 శాతానికి కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అధిక విక్రయాల పరిమాణం ఉన్నప్పటికీ కొనసాగుతున్న ధరల ఒత్తిడి ఈ వృద్ధిని పరిమితం చేస్తుంది’ అని క్రిసిల్ నివేదిక తెలిపింది. -
భారత వృద్ధి అంచనాలకు ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను విడుదల చేసింది. 2025–26లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2026–27) 6.8 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలు వరుసగా 6.9%, 7% చొప్పున ఉండడం గమనార్హం. అంటే 0.2 % మేర తగ్గించినట్టు తెలుస్తోంది. అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలుగా ఎస్అండ్పీ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–15) 6.8% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2027–28 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7%గా ఉండొచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. ‘భారత్‌లో జీడీపీ వృద్ధి 2024–25లో 6.8%కి నిదానించొచ్చు. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపనలు పట్టణ డిమాండ్‌ను తగ్గించనున్నాయి. అదే సమయంలో పీఎంఐ ఇంకా విస్తరణ దశలోనే ఉంది. ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచికలు మాత్రం వృద్ధి నిదానించినట్టు చెబుతున్నాయి’ అని తెలిపింది. మరోవైపు 2024లో చైనా 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందన్న గత అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కొనసాగించింది. ట్రంప్ సర్కారు రూపంలోరానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి చైనా వృద్ధి అంచనాలకు కోత విధించింది. -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్‌ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్‌లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
అధిక వృద్ధి బాటలోనే భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోతలు విధిస్తున్నప్పటికీ ఎకానమీ అధిక వృద్ధి బాటలోనే ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 6.5 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చాలా ముందే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ‘ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్), ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాదికి సంబంధించి వృద్ధి అంచనాలను స్వల్పంగానే కుదించాయి. ఈ అంచనాల ప్రకారం చూసినా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదిగే ఎకానమీగా ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. వినియోగం మందగించడం, అంతర్జాతీయంగా కఠిన పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇటీవలే 6.3 – 6.4 శాతం శ్రేణికి ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కుదించాయి. దీనివల్ల మనమేమీ వెనకబడిపోతున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదని సన్యాల్ చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 8 శాతం పైగా వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులపరంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాకా భారత్ వృద్ధి రేటు మరింత వేగవంతం కాగలదని సన్యాల్ చెప్పారు. వివిధ సంస్కరణలతో బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసినందున అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాలు భారత ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగా ఉండబోవని సన్యాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అప్రమత్తత కొనసాగించాల్సి ఉంటుందన్నారు. -
వ్యాపారం ప్రారంభించడానికి షార్ట్కట్లు ఉండవు
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
భారత్ వృద్ధి 6.8 శాతం
వాషింగ్టన్: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.8 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2023–24లో ఈ రేటు 6.1 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. అంతర్జాతీయ తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నెట్టుకు వస్తోందని వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్ ఇండియా మిషన్ చీఫ్ చౌయిరీ నాడా పేర్కొన్నారు. అంతక్రితం ఆమె భారత్ అధికారులతో జరిగిన వార్షిక సంప్రదింపులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, భారత్ వృద్ధి ఒక మోస్తరుగా కొనసాగుతుంది. అవుట్‌లుక్ ‘పేవరబుల్’కన్నా దిగువస్థాయిలోనే ఉంటుంది. కఠిన ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిని కల్పిస్తాయి. అయితే క్రితం అంచనాలకన్నా ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ‘వాస్తవానికి, మా అంచనాల్లో ఈ సంవత్సరం– తదుపరి సంవత్సరం ప్రపంచ వృద్ధికి భారతదేశం అరశాతంమేర భాగస్వామ్యాన్ని కలిగిఉంటుంది’’ అని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం అటు వాణిజ్య పరంగా ఇటు ఫైనాన్షియల్ రంగం పరంగా భారత్‌పై ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం ద్రవ్యోల్బణం సవాళ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌తో విస్తృత స్థాయి సంస్కరణలు –వాటి అమలు ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. అలాగే దేశంలో విస్తరిస్తున్న డిజిటలైజేషన్ ప్రయోజనాలను భారత్ భారీగా పొందనుందని వివరించారు. వృద్ధిలో బలహీనతలు ఉన్నాయ్: జయంత్ వర్మ ఇదిలాఉండగా, భారత్ ఎకానమీ వృద్ధి ధోరణి చాలా బలహీనంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. వృద్ధి పటిష్టతకు నాలుగు అంశాల్లో బలపడాల్సి ఉందని పేర్కొంటూ... ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు, మూలధన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెంపుపై తక్షణ దృష్టి అవసరమని పేర్కొన్నారు. 2022–23లో భారత్ వృద్ధి రేటును ఆర్బీఐ 6.8 శాతంగా అంచనావేస్తుండగా, ప్రపంచ బ్యాంక్ విషయంలో ఈ రేటు 6.9 శాతంగా ఉంది. -
ఈసారి భారత్ వృద్ధి రేటు 7%
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందంటూ సెప్టెంబర్‌లో వేసిన అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా అప్డేట్లో యథాతథంగా కొనసాగించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశీయంగా వినియోగదారుల ధీమా, విద్యుత్ సరఫరా, పర్చేజింగ్ మేనేజర్స్ సూచీలు మొదలైనవి ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. అయితే, ఎగుమతులు .. ముఖ్యంగా టెక్స్టైల్స్, ముడి ఇనుము మొదలైనవి అంత సానుకూలంగా కనిపించడం లేదని ఏడీబీ ఒక నివేదికలో తెలిపింది. 2022–23లో ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరి, తర్వాత 5.8 శాతానికి దిగి రావచ్చని వివరించింది. 2023–24కి సంబంధించిన అంచనాలను 7.2 శాతం స్థాయిలో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది. 2021–22లో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. మరోవైపు, ఆసియా వృద్ధి అంచనాలను ఏడీబీ కుదించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 4.2 శాతంగాను, వచ్చే ఏడాది (2023) 4.6 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది. గతంలో ఇది వరుసగా 4.3 శాతం, 4.9%గా ఉండొచ్చని అంచనా వేసింది. -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ►క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ►మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ►అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ►భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
భారత్ వృద్ధికి ఐఎంఎఫ్ రెండో కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్‌లుక్ విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక, విశ్లేషణా సంస్థలు 2022–23 భారత్ వృద్ధి అంచనాలను కుదిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం గమనార్హం. 2021–22లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతం. ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’లో ఈ విషయాలను వెల్లడించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిందని విశ్లేషించింది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తోందని వివరించింది. ప్రపంచ వృద్ధి 3.2 శాతమే... 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్ అంచనావేసింది. 2001 తర్వాత ప్రపంచ వృద్ధి ఈ స్థాయిలో బలహీనపడటం (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 తీవ్ర స్థాయి కాలాలతో పోల్చితే) ఇదే తొలిసారి. అవుట్‌లుక్ ప్రకారం, అమెరికా జీడీపీ 2022 తొలి భాగంలో క్షీణతలోకి జారింది. 2023లో ఒక శాతం వృద్ధి నమోదుకావచ్చు. -
వృద్ధి రేటు 7.3 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో 7.8 శాతంగా ఉంటుందన్న గత అంచనాను 7.3 శాతానికి సవరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంచనాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం పాటు గరిష్టాల్లో ఉండడం ఆందోళనకరమని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. దీనివల్ల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటి కంటే మరింత అధికంగా రేట్లను పెంచాల్సి వస్తుందని పేర్కొంది. ఇది ఉత్పత్తిపై, ఉపాధి కల్పనపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్అండ్పీ చివరిగా 2021 డిసెంబర్లో భారత్ వృద్ధి అంచనాలను ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి 7.8 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనాలు వ్యక్తీకరించింది. కానీ, అప్పటికి ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండగా, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కూడా లేదు. ముఖ్యంగా గత మూడు నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడం తెలిసిందే. 2023–24లో 6.5 శాతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతంగా ఎస్అండ్పీ అంచనా వేసింది. ‘‘చివరిసారి మా వృద్ధి అంచనాల తర్వాత రిస్క్‌లు పెరిగిపోయాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదం వృద్ధి రేటును కిందకు తీసుకెళుతుంది’’అని ఎస్అండ్పీ పేర్కొంది. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు కావచ్చని అంచనా. ఈ నెలాఖరులో ఈ గణాంకాలు రానున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉండొచ్చని ఎస్అండ్పీ తెలిపింది. -
భారత్ ఆర్థిక వృద్ధి రేటులో ఎలాంటి మార్పు లేదు: ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రికవరీ ఇంకా విస్తృత స్థాయిలో లేదని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మార్చితో ముగిసే 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందన్న తమ గత ఏడాది జూన్ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్పై బ్యాంక్ తాజా నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. కాంటాక్ట్ ఇంటెన్సెవ్ సేవల పునరుద్ధరణ నుంచి ఎకానమీ ప్రయోజనం పొందాలి. ఎకానమీకి ద్రవ్య, విధానపరమైన మద్దతు పూర్తిస్థాయిలో లభించడం కొంత కష్టం. 2022-23లో వృద్ధి 8.7 శాతం, 2023-24లో 6.8 శాతం వృద్ధి నమోదుకావచ్చు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణం. దక్షిణాసియాలో కరోనా సవాళ్లకు తోడు వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ బ్యాంకుల లక్ష్యాలకన్నా ఇది తీవ్రంగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2021లో 5.5 శాతంగా ఉంటే, 2022లో 4.1 శాతానికి పెరిగే వీలుంది. అయితే 2023లో వృద్ధి 3.2 శాతంగా ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సరళతర ఆర్థిక విధానాలు వెనక్కు తీసుకోవడం, డిమాండ్ వ్యత్యాసాలు దీనికి ప్రధాన కారణం. యూబీఎస్ అంచనాలు 9.1 శాతానికి కోత మరోవైపు భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలను స్విస్ బ్రోకరేజ్ దిగ్గజం-యూబీఎస్ సెక్యూరిటీస్ 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో అంచనాలు 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గాయి. మార్చి త్రైమాసికంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దీనికి ప్రధాన కారణమని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఒమిక్రాన్ ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. దీనితో 2022-23 వృద్ధి అంచనాలను 7.7 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. 2022-23లో భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రపంచ దేశాల్లోనే వేగంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత రుణ వృద్ధి రేటు తీరు (దాదాపు 7 శాతం) పట్ల ఆందోళన వ్యక్తం చేసిన యూబీఎస్, ఈ రేటు 2022-23లో 10 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. ఇక ద్రవ్యోల్బణం 2022-23లో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022–23 ఏప్రిల్ తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనావేసింది. అమెరికా ఫెడ్ ఫండ్‌రేటు పెంపు, ఫారిన్ నిధులు వెనక్కు వెళ్లడం, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తప్పడం, చమురు ధర 100 డాలర్లకు పెరిగే అవకాశం వంటి అంశాల నేపథ్యంలో 2022లో రూపాయి మారకపు విలువ 78కి పడిపోయే వీలుందని అభిప్రాయడింది. మరికొన్ని అంచనాలు ఇలా.. ఎకానమీపై కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8-5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2020-21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021-22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.3 నుంచి 9.5 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. (చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!) -
వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన పరిస్థితి గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసిందని సోమవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటును 4.8 శాతానికి సవరించింది. అంతేకాదు ఇది ప్రతికూల ఆశ్చర్యంగా పక్రటించింది. గత ఏడాది ఇదేకాలంలో ఐఎంఎఫ్ అంచనా 7.5 శాతం. అక్టోబర్‌లో 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో 0.1 శాతం తగ్గించిన ఐఎంఎఫ్ భారతదేశ ఆర్థిక మందగమనానిదే "సింహభాగం" అని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక అశాంతిని తీవ్రతరం చేయడం, అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం, అలాగే ఇతర దేశాల మధ్య ఆర్థిక ఘర్షణలులాంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపింది. దేశీయంగా బ్యాంకుయేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి ,రుణ వృద్ధి క్షీణత, దేశీయ వినిమయ డిమాండ్ ఊహించిన దానికంటే చాలా మందగించిందని వ్యాఖ్యానించింది. ఇదే వృద్ధి రేటును తగ్గించడానికి కారణమని తెలిపింది. మరోవైపు జపాన్ వృద్దిరేటును అంచనాలను బాగా పెంచింది ఐఎంఎఫ్. ప్రధానంగా జపాన్ ప్రధాని షింజో అబే గత నెలలో ప్రకటించిన స్టిములస్ ప్యాకేజీ కారణంగా వృద్ధి పురోగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2020 నాటికి 0.7శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. గత అక్టోబరు లో ఇది 0.5 శాతంగా మాత్రమే వుంటుందని అంచనావేసింది. అలాగే అమెరికా-చైనా ట్రేడ్‌డీల్ కారణంగా చైనా వృద్ది రేటుకు పైకి సవరించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఒక శాతం పెరిగి 5.8 శాతంగా ఉండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ వుంటుందని తెలిపింది. 6.5 శాతం వృద్ధి రేటుతో చైనా (5.8 శాతం)ను అధిగమించి 2021 లో భారత్ మొదటి స్థానంలో నిలబడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథాన్ని స్వల్పంగా క్రిందికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్దిపై కొత్త అంచనాలు 2019 లో 2.9 శాతం, 2020 లో 3.3 శాతం, 2021 లో 3.4 శాతం వృద్ధినగా వుంచింది.. భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అభిప్రాయపడింది. అయితే దేశ వృద్ది 2020లో 5.8 శాతంగాను, 2021లో 6.5 శాతానికి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభోత్సవానికి ముందు, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ వృద్ధి మళ్లీ మందగించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మళ్లీ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద పరిణామాలతో అక్టోబర్ నుంచి కొన్ని నష్టాలు పాక్షికంగా తగ్గాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుండగా, ఐరాస 5.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020) వృద్ధి రేటు 7.2 శాతమే ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతం. ఇందుకు ప్రధాన కారణాల్లో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణతని ఏడీబీ బుధవారం విడుదల చేసిన తన ఏసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2019 నివేదికలో పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ► 2018–19 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను కూడా ఏడీబీ తగ్గించింది. డిసెంబర్లో ఈ రేటును 7.3 శాతంగా అంచనావేయగా, దీనిని తాజాగా 7 శాతానికి కుదించింది. ► 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (7.2 శాతం) ఈ రేటు తగ్గిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రేటు కోతకు వ్యవసాయ ఉత్పత్తి బలహీనత, వినియోగ వృద్ధి మందగమనం కారణమని పేర్కొంది. అధిక అంతర్జాతీయ క్రూడ్ ధరలు, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం కూడా వృద్ధి తగ్గడానికి కారణమని విశ్లేషించింది. ► 2020లో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్న ఏడీబీ, పాలసీ రేటు కోత, రైతులకు ఆదాయ మద్దతు, దేశీయ డిమాండ్ పెరుగుదల దీనికి ప్రధాన కారణాలు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు, వ్యాపార, పెట్టుబడుల వాతావరణంలో సానుకూల మార్పులు కూడా రానున్న కాలంలో భారత్ వృద్ధికి కారణమవుతాయి. ► భారత్ అంతర్జాతీయంగా తక్షణం ఎదుర్కొంటున్న కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. అంతర్జాతీయ డిమాండ్ మందగమనం, ద్రవ్య పరిస్థితుల్లో క్లిష్టత, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం ముగింపుపై అనిశ్చితి, అభివృద్ధి చెందిన దేశాల్లో బలహీన ఆర్థిక పరిస్థితులు ఇందులో ప్రధానమైనవి. ► దేశీయంగా చూస్తే, ఆదాయాలు తగ్గడం తీవ్ర ప్రతికూలాంశం. ఇది ద్రవ్యలోటు సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్యనూ ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఇన్ని సమస్యలున్నా, 2019–20లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది. ► కుటుంబాల పొదుపులు, కార్పొరేట్ మూలాల పటిష్టత భారత్ ఎకానమీకి సానుకూల అంశాలని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకీ సవాడా పేర్కొన్నారు. యువత ఎక్కువగా ఉండడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం, పెరుగుతున్న ఎగుమతులూ దేశానికి లాభిస్తున్నాయని అన్నారు. ► వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2019–20లో సగటున 4.3 శాతంగా ఉంటే, 2020–21లో 4.6 శాతంగా ఉంటుందని ఏడీబీ పేర్కొంది. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం దేశంలో డిమాండ్ పటిష్టతకు దోహదపడే అంశంగా విశ్లేషించింది. ► దేశంలో డిమాండ్ పరిస్థితులు బాగుండడం వల్లే దిగుమతులు పెరుగుతున్నాయి. ► ఇక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం (జీడీపీ విలువలో పోల్చి), 2020–21లో 2.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. అయితే క్యాడ్ సమస్యను భారత్ విజయవంతంగా అధిగమించే అవకాశం ఉంది. దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుండడమే దీనికి కారణం. ► దక్షిణాసియాలో మందగమన పరిస్థితులు మొత్తం ఆసియాపై ప్రతికూలత చూపవచ్చు. -
నెంబర్ 2@ 2030
గ్రేటర్ నోయిడా: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ, ప్రపంచబ్యాంక్ వంటి దిగ్గజాలు భారత్ వృద్ధి వేగం కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులనూ దేశం తట్టుకుని తగిన వృద్ధి రేటును సాధిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా ఉంది’’ అని ప్రధాని అన్నారు. సోమవారం నుంచీ మూడు రోజుల పాటు ఇక్కడ జరగనున్న అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు– పెట్రోటెక్ 2019ను ప్రధాని ప్రారంభించారు. భాగస్వామ్య దేశాల నుంచి 95 మందికి పైగా ఇంధన శాఖ మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 7,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు... ∙భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది.ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం– 2030 నాటికి భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుంది. ∙ఇటీవల క్రూడ్ ధరల తీవ్ర ఒడిదుడుకుల పరిస్థితిని చూస్తున్నాం. అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారులు ఇరువురి ప్రయోజనాలకు తగిన సమతౌల్య ధరల విధానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే చమురు, గ్యాస్ ధరలు పారదర్శకంగా, తగిన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడే సమాజం ఇంధన అవసరాలను మనం నెరవేర్చగలుగుతాం. ∙పారిస్ వాతావరణ సదస్సు–2015 లక్ష్యాలను సాధించే దిశలో కూడా భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ∙ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ (ముడి చమురు శుద్ధి)సామర్థ్యాన్ని సముపార్జించుకుంది. ప్రస్తుతం 230 ఎంఎంటీపీఏ (వార్షికంగా... మిలియన్ మెట్రిక్ టన్నులు)గా ఉన్న సామర్థ్యం 2030 నాటికి మరో 200 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ∙బయో ఫ్యూయెల్ విధానాన్ని గత ఏడాది రూపొందించాం. పటిష్ట ఇంధన ప్రణాళికలను రూపొందించి అవలంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమగ్ర, పటిష్ట ఇంధన విధానం అవలంభించడం దేశానికి ప్రస్తుతం ఎంతో అవసరం. గ్రామాలకు ఇప్పటికే విద్యుత్ సదుపాయాలను పూర్తిగా విస్తరించడం జరిగింది. ఇక గృహాలకు 100 శాతం విద్యుత్ ఈ ఏడాది దేశం లక్ష్యం. ఇదే సమయంలో విద్యుత్ ఆదాకు తగిన ప్రణాళిననూ దేశం అనుసరిస్తోంది. ∙పొగ సంబంధ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా క్లీన్ కుకింగ్ ఫ్యూయెల్‌ను అందుబాటులోనికి తీసుకురావడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. 6.4 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే ఎల్పీజీ సౌలభ్యతను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి రిఫైనింగ్, పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, క్రూడ్ నిల్వల వంటి రంగాల్లో భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) ఆసక్తితో ఉందని యూఏఈ మంత్రి, ఏడీఎన్ఓసీ (అబూ ధబీ నేషనల్ ఆయిల్ కంపెనీ) సీఈఓ సుల్తాన్ అహ్మద్ అల్ జబీర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రతిపాదిత 44 బిలియన్ డాలర్ల రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో ఏడీఎన్ఓసీ, దాని భాగస్వామి సౌదీ ఆరామ్కోలు సంయుక్తంగా 50 శాతం వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నట్లు అహ్మద్ అల్ జబీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 6వ స్థానం... 2013–14లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిఉన్న భారత్ తాజాగా ఆరవ స్థానానికి ఎదిగింది. ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను సైతం త్వరలో అధిగమిస్తుందని కొందరి విశ్లేషణ. ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుకాగా, భారత్ జీడీపీ విలువ 2.59 లక్షల డాలర్లు. కాగా ఫ్రాన్స్ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఇటీవల స్టాండెర్డ్ చార్టర్డ్ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2030 నాటికి చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమిస్తుందని, చైనా స్థానానంలో భారత్ ఉంటుందని పేర్కొంది. అమెరికా మూడవ స్థానానికి పడుతుందని విశ్లేషించింది. -
వృద్ధి అంచనాలను కొనసాగించిన ఏడీబీ
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందన్న గత అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కొనసాగించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని సాధించగలదన్న అంచనాలను కూడా అలాగే కొనసాగించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఒత్తిడులున్నా, వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యపరమైన సమస్యలున్నా భారత్ ఈ స్థాయి వృద్ధిని సాధించగలదన్న అంచనాలను ఏడీబీ వెల్లడించింది. ‘ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2018 అప్డేట్’ పేరిట ఏడీబీ రూపొందించిన తాజా నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ∙వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతుండటం, ఎగమతులు పుంజుకుంటుండటంతో భారత వృద్ధి జోరు కొనసాగగలదు. ∙భారత జీడీపీ ఈ క్యూ1లో 8.2%, క్యూ2లో 7.1% గా నమోదైందని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవ త్సరం తొలి 6 నెలల్లో వృద్ధి సగటున 7.6%గా ఉంది. ∙క్యూ2లో వృద్ధి అంచనాల కంటే తక్కువే. ∙వాణిజ్య ఉద్రిక్తతలు, ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలున్నా, క్రూడ్ ధరలు దిగిరావడం భారత్‌కు కలసిరానున్నది. ∙మరోవైపు రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతులు పుంజుకుంటాయి. ∙ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం వృద్ధిని సాధించగలదు. ∙దేశీయంగా అధిక డిమాండ్ కారణంగా ఆసియా దేశాలు విదేశీ ప్రతికూలతలను తట్టుకోగలవు. -
భారత్ వృద్ధికి ఫిచ్ కోత
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ మందగమన సంకేతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ తాజాగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించటం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ముందుగా వెలువరించిన వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 7.2 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫిచ్ పేర్కొంది. జూన్‌లో 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసి... సెప్టెంబర్‌లో దాన్ని పెంచటం గమనార్హం. అధిక భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటివి వృద్ధి అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలుగా రేటింగ్ దిగ్గజం తెలియజేసింది. 2017–18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకగా... తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో 7.1 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికంటే తక్కువగానే ఫిచ్ అంచనాలుండటం గమనార్హం. ఇక 2019–20 ఏడాదికి వృద్ధి రేటు 7 శాతం, 2020–21లో 7.1 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. సెప్టెంబర్‌లో అంచనా వేసిన 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లకు కూడా కోత పడింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈ ఏడాది క్యూ2 వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం. ► వినియోగం రేటు 8.6 శాతం నుంచి 7 శాతానికి బలహీనపడినప్పటికీ.. ఇంకా మెరుగ్గానే కనబడుతోంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. 2016–17ద్వితీయార్థం నుంచీ పెరుగుతున్నాయి. ► దిగుమతుల అంతకంతకూ పెరిగిపోవడంతో వాణిజ్య లోటు మరింత ఎగబాకవచ్చు. ► వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య విధానాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చు(ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది). ► ప్రభుత్వం వ్యయాలను పెంచడం ద్వారా.. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు భారీగా నిధులను వెచ్చిండం వల్ల జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి పడిపోకుండా అడ్డుకట్ట పడింది. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► బ్యాంకింగ్ రంగం ఇంకా అధిక మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ డిఫాల్ట్ తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లకు ద్రవ్య సరఫరా తగ్గి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ► రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవ కాశాలున్నాయి. ఇటీవలి కాలంలో తగ్గిన ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, రూపాయి పతనం కారణంగా దిగుమతుల భారం కావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ► ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం రూపాయి క్షీణతకు మరింత ఆజ్యం పోస్తాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలు యథాతథం.. ఈ ఏడాది (2018) ప్రపంచ వృద్ధి అంచనాలను యథాతథంగా 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. వచ్చే ఏడాది( 2019) అంచనాల్లోనూ (3.1%) మార్పులు చేయలేదు. మరోపక్క, చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. గత అంచనాలను కొనసాగించింది. ఇక ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిలో కొంత కోతకు అంగీకరించే అవకాశం ఉందని... దీనివల్ల ప్రస్తుత స్థాయి నుంచి ముడిచమురు ధరలు కొంత పుంజుకోవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. ‘2018 ఏడాదికి సగటు క్రూడ్(బ్రెంట్) బ్యారెల్ ధర 72.5 డాలర్లుగా ఉండొచ్చు. వచ్చే ఏడాది అంచనా 65 డాలర్లలో మార్పులేదు. 2020 అంచనాలను మాత్రం 57.5 డాలర్ల నుంచి 62.5 డాలర్లకు పెంచుతున్నాం’అని ఫిచ్ తెలిపింది. కాగా, అక్టోబర్ ఆరంభంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు రేటు 85 డాలర్ల నుంచి నవంబర్ ఆఖరి నాటికి 60 డాలర్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. -
భారత్ వృద్ధి బాట పటిష్టం!
న్యూయార్క్: భారత్ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2018–2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019–2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... సమీప భవిష్యత్‌తో భారత్ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్ బాగుంది. ద్రవ్యోల్బణం 2018–19లో 5.2 శాతంగా ఉంటుంది. డిమాండ్ పరిస్థితులు పటిష్టంగా ఉండడం, రూపాయి విలువ క్షీణత, చమురు ధరలు, హౌసింగ్ రెంట్ అలవెన్స్‌ల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు దీనికి కారణం. 2018–19కి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 2.6%గా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల, దిగుమతులకు డిమాండ్ దీనికి కారణం. భారత్ ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి తగిన చర్యలు ఉన్నాయి. బ్యాంకింగ్ రుణ వృద్ధి మెరుగుపడుతోంది. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో చర్యలు ఉన్నాయి. రానున్న కొద్ది దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకపాత్ర పోషించనుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (ఇండియా) రానిల్ సెల్గాడో పేర్కొన్నారు. ఈ విషయంలో గత చైనా పాత్రను ఇకపై భారత్ పోషించే వీలుందని అన్నారు. 2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్, ఆ తర్వాత జీఎస్టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతోంది ఇటీవలి రేట్ల పెంపు సరైనదే. రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
సూపర్ ఫాస్ట్ స్పీడుతో దూసుకుపోతోంది!
మనీలా : దేశీయ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ వృద్ధిరేటు అద్భుతమైన వేగంగా ఉందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) అభివర్ణించింది. ఇదే స్థాయిలో దూసుకుపోతే, దశాబ్దంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండింతలు కానుందని ఏడీబీ చీఫ్ ఎకనామిస్ట్ యసుయుకి సవాడా అన్నారు. 8 శాతం వృద్ధి రేటు సాధించలేదని భారత్ ఆందోళన చెందాల్సినవసరం లేదని, కానీ ఆదాయ అసమానతలు తగ్గించి, దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాలని సూచించారు. వృద్ధి రేటు ఎగుమతులు కంటే దేశీయ వినియోగంపైనే ఎక్కువగా వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. 2018-19లో 7.3 శాతం వృద్ధి రేటుతో ఆసియా దేశాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని ఏడీబీ పేర్కొంది. ఈ వృద్ధి రేటు 2019-20 కల్లా 7.6 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనా వేసింది. 7 శాతమనేది నిజంగా చాలా వేగవంతమైనదని, ఒకవేళ 10 ఏళ్లు కూడా 7 శాతం వృద్ధిరేటునే కొనసాగిస్తే, దేశీయ ఆర్థికవ్యవస్థ పరిమాణం రెండింతలవుతుందని సవాడా పేర్కొన్నారు. ఇది చాలా వేగవంతంగా దూసుకుపోతున్న వృద్ధి రేటు, ఈ రీజియన్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇదీ ఒకటని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటు సాధించి, వచ్చే ఏడాదిలో 7.6 శాతాన్ని తాకుతుందని, ఇది నిజంగా అద్భుతమైన వేగమేనని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 8 శాతం వృద్ధి రేటు అనేది భారత్‌కు అతిపెద్ద సవాల్ అని సవాడా పేర్కొన్నారు. 7 శాతం వృద్ధి అనేది చాలా మంచి నెంబర్, 8 శాతం సాధించలేదని భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎగుమతులు భారత వృద్ధిని నిర్థారించవని, దేశీయ మార్కెటే వృద్ధి రేటుకు చాలా కీలకమని పేర్కొన్నారు. ఎగుమతులు వృద్ధిని పెంచడంలో ఒక భాగమే మాత్రమే కానీ ఎక్కువగా దేశీయ మార్కెటే కీలకమైనదని తెలిపారు. ఆదాయ అసమానతలు, పేదరికం తగ్గింపు ఎక్కువ వృద్ధి రేటు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. -
భారత వృద్ధి 7.6 శాతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత్ వృద్ధి రేటును 2018 సంవత్సరానికి 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. 2018 సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను మార్పు చేయకుండా గతంలో వెల్లడించిన మేరకు 7.6 శాతం నమోదవుతుందని స్పష్టంచేసింది. 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రముఖ వర్ధమాన దేశాల్లో భారత్, ఇండోనేషియా దేశాల వృద్ధి అంచనాలను మాత్రమే మార్పు చేయడం లేదని పేర్కొంది. అంతర్జాతీయంగానూ వృద్ధి మెరుగే 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ధి అంచనాలను సైతం మూడీస్ పెంచింది. అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. -
చైనా మందగమనం భారత్‌కు మంచిదే..!
‘గ్రాంట్స్’కు సప్లిమెంటరీ డిమాండ్‌పై చర్చకు అరుణ్ జైట్లీ సమాధానం ♦ జీఎస్టీ అమలు ఆలస్యంపై ఆవేదన ♦ పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 1.1 లక్ష కోట్లు అవసరం న్యూఢిల్లీ : చైనా ఆర్థిక వ్యవస్థ మందగమన ధోరణి భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగడానికి దోహదపడే అంశమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 నుంచి 2 శాతం వృద్ధికి దోహదపడే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ఆలస్యం కావడం పట్ల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి గతవారం పార్లమెంటులో తన మొట్టమొదటి సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం దాదాపు రూ.25,500 కోట్లు. స్థూలంగా రూ.40,822 కోట్ల వ్యయాలకు అనుమతి కోరితే... పొదుపులు లేదా పెరిగిన వసూళ్లు, రికవరీలు అన్నీ (దాదాపు రూ.15,326 కోట్లు) పోనూ నికర నగదు వ్యయ డిమాండ్ రూ.25,500 కోట్లు. ఇందులో సగం బ్యాంకులకు తాజా మూలధన కేటాయింపులకు సంబంధించినదే కావడం గమనార్హం. దీనిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ► పెట్టుబడుల పునరుద్ధరణ, నిలిచిపోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం కేటాయింపులు వంటి పలు చర్యలను కేంద్రం తీసుకుంటోంది. తగిన వర్షపాతమూ నమోదయ్యే అవకాశం ఉంది. వీటిన్నింటి దన్నుతో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ► రానున్న ఐదేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. రూ.1.10 లక్షల కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ అకౌంట్ల నిరర్ధక ఆస్తుల్లో స్టీల్, విద్యుత్, రహదారుల రంగాలే మెజారిటీగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి సాధన క్రమంలో ఎన్పీఏల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. ► జీఎస్టీ అమలుకు అన్ని పార్టీలూ సహకరించాలి. దీనివల్ల దేశ వ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో ఏకరూపత వస్తుంది. వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడుతుంది. ఇలాంటి విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ► చైనాలో కంపెనీల వేతన బిల్లులు పెరిగిపోయాయి. దీనిని భరించాలంటే- ఆయా కంపెనీలు ఉత్పత్తిచేసే వస్తువుల ధరలు పెరగాలి. ఇలాంటి పరిస్థితిని భారత్ తనకు సానుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తయారీ రంగానికి భారత్ కేంద్రంగా పరిణతి చెందాలి. ఇదే జరిగితే భారత్ వృద్ధి మరింత జోరందుకుంటుంది. ► మనం 8 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. రెవెన్యూ వసూళ్లు కూడా ఇందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలూ సానుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పరోక్ష పన్ను వసూళ్ల విభాగం బాగుంది. ► విదేశీ విభాగంలో ఆర్థిక అంశాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతం పెరిగాయి. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలో ఉంది. ► తగిన నిధుల లభ్యత వల్ల సామాజికాభివృద్ధి పథకాల్లో కూడా కేంద్రం నిధులను వెచ్చించగలుగుతుంది. ► బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు పెద్దగా తేడా ఉండకుండా చూసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ అంచనాలకన్నా... సవరించిన అంచనాలు స్వల్ప స్థాయిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ► కొన్ని రాష్ట్రాల్లో ఆహార పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగునీటి పారుదలపై మరింత వ్యయాలు పెంచాలి. ► 8 నుంచి 9 శాతం వృద్ధి సాధనలో రాష్ట్రాల పాత్రా కీలకం. వాటికి తగిన స్థాయిల్లో నిధులు అందజేస్తాం. ఏ రాష్ర్టం పట్లా పక్షపాత ధోరణి ఉండబోదు.