
ఆర్థిక వ్యవస్థను మోదీ నిర్వహిస్తున్న తీరు పేలవంగా ఉందన్న రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థను సత్వర వృద్ధి దిశగా నడిపిస్తామని సీఐఐ 125వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటే ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నీరుగార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్ధను ప్రధాని నరేంద్ర మోదీ నడినిస్తున్న తీరు తీసికట్టుగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పెదవివిరిచిందని రాహుల్ ప్రస్తావించారు. పేదలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి సాయం లేకపోవడంతో మున్ముందు విపత్కర పరిస్ధితులు నెలకొంటాయని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది.