చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ | Govt Earns Rs 2364 Crore by Selling Office Scraps in Three Years Tweet Viral | Sakshi
Sakshi News home page

చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ

Published Sun, Nov 10 2024 5:54 PM | Last Updated on Sun, Nov 10 2024 6:09 PM

Govt Earns Rs 2364 Crore by Selling Office Scraps in Three Years Tweet Viral

కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛత' ప్రచారాల ద్వారా స్క్రాప్‌ల (చెత్త) తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేవలం మూడేళ్ళలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి 'జితేంద్ర సింగ్' సోషల్ మీడియాలో వెల్లడించారు.

స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చేకూర్చడానికి సహకరించిన 'డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (DPIIT)ను భారత ప్రధాని 'మోదీ' ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి సారించడం ద్వారా గొప్ప ఫలితాలను సాధించారు. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ.. సమిష్టి ప్రయత్నాలు స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో ఇది చూపిస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రతన్‌ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీ

స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ ఫైళ్లను తొలగించడం వల్ల 15,847 అడుగుల స్థలం ఖాళీ అయింది. దీని ద్వారా సుమారు రూ. 16,39,452 ఆదాయం లభించింద వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిజికల్ ఫైల్స్ ప్రతి ఏటా భారీగా పెరగడం వల్ల కార్యాలయాల్లో స్థలం కూడా నిండుతుంది. వీటన్నింటిని తొలగించడం వల్ల ఖాళీ స్థలం ఏర్పడమే కాకుండా.. ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement